ఏపీలో చిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్పినట్టు వినాలని.. సీఎం జగన్ స్థాయిలో ఆదేశాలు ఉన్నాయి. కానీ, కొందరు మాత్రం ఈ మాటలను లెక్కచేయడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్టు వారు వ్యవహరిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు మధ్య వివాదాలు రోజుకోరకంగా మారు తున్నాయి. ఇక, ఇప్పుడు ఏకంగా.. డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది.
ఎక్సైజ్ శాఖ మంత్రిగా తాను చెప్పిన దానికి అధికారులు ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని.. నారాయణ స్వామి బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎక్సైజ్ శాఖలో పోస్టింగ్‌ల వివాదంతో ఆయన తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మంత్రి నారాయణ స్వామి, ఎక్సైజ్ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ మధ్య వివాదం ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి చేరింది. డిప్యూటీ సీఎం ఇచ్చిన ఆదేశాన్ని స్పెషల్ సీఎస్ అమలు చేయకపోవడంతో.. తన ఆదేశాన్ని స్పెషల్ సీఎస్ పట్టించుకోవడం లేదంటూ నారాయణ స్వామి సీఎం కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్సైజ్‌ను 30:70 నిష్పత్తిలో ఎక్సైజ్, స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోగా విభజించింది. దీంతో ఎక్కువమంది అధికారులు, కానిస్టేబుళ్లు సెబ్‌కు వెళ్లిపోయారు. కాగా, పని ఒత్తిడి కారణంగా సెబ్‌లో ఉన్నవారు ఎక్సైజ్‌కు రావాలని చాలాకాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. మరో వైపు ఎక్సైజ్‌కు నాలుగు డిప్యూటీ కమిషనర్ పోస్టులు కేటాయించగా ప్రస్తుతం గుంటూరు, కర్నూలు డీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
గుంటూరు డీసీ పోస్టును సెబ్‌లో ఉన్న ఓ డిప్యూటీ కమిషనర్‌కు ఇవ్వాలని నారాయణస్వామి దాదాపు 2నెలల కిందట ఆదేశించారు. అయితే పదోన్నతి పొందబోయే మరో అధికారికి ఆ పోస్టింగ్ ఇవ్వాలనే ఆలోచనతో స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ దాన్ని అమలు చేయలేదు. ప్రస్తుతం ఆ అధికారి అసిస్టెంట్ కమిషనర్‌గా ఉన్నారు. ఒకట్రెండు రోజుల్లో ఆయన డీసీ అవుతారు. అప్పుడు ఆయన్ను గుంటూరు డీసీ చేయాలని రజత్ భార్గవ ప్రయత్నిస్తున్నారు.
తాను చెప్పిన అధికారిని సెబ్ నుంచి ఎక్సైజ్‌కు తీసుకొచ్చి గుంటూరు డీసీ చేయాలని నారాయణస్వామి పలుమార్లు గుర్తుచేశారు. కానీ త్వరలో పదోన్నతుల ప్రక్రియ ఉందనే కారణం చూపి ఈ ఆదేశాన్ని ఐఏఎస్ పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఉపముఖ్యమంత్రి పది రోజుల కిందట నేరుగా సీఎంవోలో ఫిర్యాదు చేశారు. ఒక పోస్టింగ్ విషయంలోనూ తన ఆదేశం అమలుచేకపోతే ఎలాగని ఆయన అసంతృప్తితో ఉన్నట్లు తెలిసింది. మొత్తానికి మంత్రి వర్సెస్ ఐఏఎస్ మధ్య వివాదం సీఎం జగన్‌కు తలనొప్పిగా మారిందని అంటున్నారు.
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…