Political News

ఒక్క ఛాన్స్ ప్లీజ్‌: ప‌వ‌న్ వ్యాఖ్య‌లు

జనసేన అధినేత పవన్కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. పిఠాపురం బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ రాష్ట్రం గూండాలకు అడ్డాగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికారం ఇవ్వాలని, తనను ఒక్క సారి ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రి పదవి చేపడితే దేశంలోనే ఏపీని నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దుతానని అన్నారు. ఇలాంటి గూండాలు మనల్ని పాలిస్తున్నారంటే సిగ్గుపడాలని అసహనం వ్యక్తం చేశారు. రాష్ట్రం బాగుపడాలంటే జనసేన అధికా రం ఇవ్వాలని కోరారు.`

తనకు మత పిచ్చి లేదని.. సనాతన ధర్మం పట్ల గౌరవం ఉందని ప‌వ‌న్ అన్నారు. అందరినీ సమానంగా చూసి ధర్మాన్ని చెప్పిన నేల ఇది.. వేదాలు తీసుకువచ్చిన బ్రాహ్మణ సమాజానికి నమస్కారాలు అని పేర్కొన్నారు. పిఠాపురంలో హిందూ దేవాలయాల ధ్వంసం దారుణమని తీవ్రస్థాయిలో ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఆలయాన్ని ధ్వంసం చేసింది పిచ్చివాడని ప్రభుత్వం చెప్పిందని గుర్తు చేస్తూ.. 219 హిందూ ఆలయాల్లోనూ పిచ్చివాళ్లే ధ్వంసం చేశారా? అని ప్రశ్నించారు. ఆలయాలపై దాడులు జరుగుతుంటే ఒక్కరినీ పట్టుకోలేదని మండిపడ్డారు.

నా ఆంధ్ర నేల కోసం నిలబడతా అని చెప్పిన పవన్.. వైసీపీ ప్రభుత్వం గూండాలకు నిలయం… వీళ్లా మనల్ని పాలించేది.. మనకు సిగ్గుండాలి.. నేరస్తులంటే నాకు అసహ్యం అని వ్యాఖ్యానించారు. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి అనుచరులు పిఠాపురం పరిధిలోని 52 గ్రామాల నుంచి రెండు కోట్ల రూపాయల మట్టి దోచుకెళ్తున్నారని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. వారి సంగతి కాకినాడలో చెబుతాను అంటూ పవన్‌ హెచ్చరించారు. 300 లారీల మట్టి దోచే వాళ్లని కాళ్లు విరగగొట్టి మీకు ఉపాధి చూపించొ చ్చు.. దోపిడీనీ అడ్డుకుంటే మీకు పది వేల కోట్లతో ఉపాధి చూపించొచ్చు అని పవన్ పేర్కొన్నారు.

నేను బతికి ఉన్నంత వరకు నేర చరిత్ర ఉన్న వాళ్లు గద్దె ఎక్కడానికి వీల్లేదు అని పవన్ స్పష్టం చేశారు. ఆంధ్ర బాగుపడా లంటే మన కులపోడా, కాదా అన్నది చూడవద్దు.. మనకు సరైనోడా కాదా అన్నది చూడండి అని పిలుపునిచ్చారు. మనకు అధికారం లేకపోతేనే ఇంత భయపడుతున్నారే.. ఎమ్మెల్యేను చేసి చూడండి.. సీఎం స్థానం ఇస్తే ఆంధ్రను దేశంలోనే ఉన్నత స్థానంలో తీర్చిదిద్దుతా అని అన్నారు.

పిఠాపురం దేవుళ్ల సాక్షిగా అడుగుతున్నాను.. నాకు అధికారం ఇవ్వండి అని పవన్ అభ్యర్థించారు. నేను డిగ్రీలు చదవకపోయినా రోజూ 5నుంచి 8 గంటలు చదువుతా అని చెప్పిన పవన్.. ఈ సారి ఎన్నికల్లో గెలవడానికి ఏ వ్వూహమైనా పన్నుతా.. కాకినాడ ఎమ్మెల్యే కోసం అమిత్ షా వద్ద రిపోర్టు ఉంది అని తెలిపారు. పన్నులు పెంచి అభివృద్ధి అని గొప్పలా..? బిల్డింగ్ అనుమతులకు 40 నుంచి 70శాతం టాక్స్ పెంచుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తాను సినిమా చేస్తే ఇండస్ట్రీలో 70 నుంచి 80 శాతం మందికి ఉపాధి దొరుకుతుందని పవన్ పేర్కొన్నారు.

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

59 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago