జగ్గారెడ్డి… సంగారెడ్డి ఎమ్మెల్యే, తెలంగాణ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ నేతగా ముద్రపడిన నాయకుడు. తనదైన శైలిలో దూకుడు రాజకీయానికి పెట్టింది పేరయిన జగ్గారెడ్డి దాదాపు గత ఏడాదిగా…తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఎప్పుడు విరుచుకుపడతారో…ఎప్పుడు విమర్శలు పక్కన పెట్టి ప్రశంసలు కురిపిస్తారో తెలియకుండా మాట్లాడుతున్నారు.
ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చెప్పిన పంటే వేయాలనే పేర్కొంటూ ఒకవేళ అలా చేయకపోతే రైతుబంధు పథకం వర్తించబోదని కీలక ప్రకటన చేసిన అనంతరం..అప్పటివరకు కేసీఆర్‌ను పొగిడిన జగ్గారెడ్డి ఈ నిర్ణయంపై మండిపడ్డారు. అనంతరం కరోనా విషయంలో అలాంటి స్టాండే అనుసరిస్తున్నారు. అయితే, తాజాగా కాంగ్రెస్ నేతలకే షాకిచ్చే కామెంట్లు చేస్తున్నారు. అదే పీసీసీ పోస్ట్ కోసం ప్రయత్నించడం.
తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రికార్డు స్థాయి సమయం మించి కొనసాగుతున్న ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆ పదవి నుంచి తొలగించి నూతన నేతకు కట్టబెట్టనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ పదవి రేసులో పెద్ద ఎత్తున నేతలు బరిలో ఉన్నారు. అయితే, ఈ పోస్ట్ కోసం జగ్గారెడ్డి బహిరంగంగానే తన ఆసక్తి, ఇతర నేతల విషయాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఎపిసోడ్‌లో తాజాగా మ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. టీపీసీసీ అధ్యక్షుడిని మార్చి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారనే చర్చ ఢిల్లీ కేంద్రంగా జరుగుతోందని జగ్గారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్‌లోని ఇతర నేతల వలే, టీపీసీసీ చీఫ్ రేసులో తాను కూడా ఉన్నానని జగ్గారెడ్డి ప్రకటించారు. కొత్త అధ్యక్షుడిని నియమించాలనుకుంటే, తనకు అవకాశం ఇవ్వాలని పార్టీ ముఖ్యులైన సోనియా, రాహుల్ గాంధీని కోరుతూనే ఉన్నానని జగ్గారెడ్డి సెలవిచ్చారు. తనకు ఆ పదవి ఇస్తే సీనియర్ల సహకారంతో పార్టీని బలోపేతం చేస్తానని కూడా ప్రకటించారు.
అయితే, ఇప్పటికే ఈ పోస్ట్ విషయంలో ఎంపీ రేవంత్ రెడ్డి సీరియస్‌గా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో జగ్గారెడ్డి ప్రకటన సహజంగానే ఆయన్ను టార్గెట్ చేసినట్లు ఉందనే టాక్ వినిపిస్తోంది. గతంలో పలు అంశాల్లో రేవంత్‌ను జగ్గారెడ్డి టార్గెటె్ చేయడం దీనికి బలం చేకూరుస్తోంది.
This post was last modified on August 11, 2020 11:43 am
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…
మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…