జనసేన అధినేత పవన్ కల్యాణ్ మైకు పట్టుకొని మాట్లాడినంతనే విరుచుకుపడేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ నేతల్లో మొదటి రియాక్షన్ వచ్చేసింది. వైసీపీ మాజీ మంత్రి.. సీనియర్ నేత పేర్ని నాని షాకింగ్ రియాక్షన్ ఇచ్చేశారు. కత్తిపూడిలో దాదాపు గంటన్నర పాటు సాగిన ప్రసంగం నేపథ్యంలో.. పేర్ని నాని మీడియా ముందుకు వచ్చారు. నారాహిగా పెట్టుకోవాల్సిన వాహనం పేరును వారాహిగా పవన్ పెట్టుకున్నారన్న ఆయన.. వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడారు.
పవన్ పూటకు ఒక మాట మాట్లాడుతున్నారన్న పేర్ని నాని.. రోజుకో డైలాగ్ చెప్పి పవన్ వ్యూహం అంటారంటూఎద్దేవా చేశారు. చంద్రబాబు బాగుండటం కోసం పవన్ ఏదైనా చేస్తాడని మండిపడ్డారు. గతంలో తనను వ్యక్తిగతంగా దూషిస్తూ.. ఫ్యాకేజీ స్టార్ అంటూ విమర్శిస్తున్న వారిపై విరుచుకుపడిన పవన్.. అప్పట్లో తన చెప్పు చూపించి.. చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇవ్వటం తెలిసిందే. పవన్ ‘చెప్పు’ మాటలకుతాజాగా స్పందించిన పేర్ని నాని.. తన రెండు చెప్పులు చూపించి..
‘‘నువ్వు ఒక్క చెప్పు చూపిస్తే.. నేను రెండు చెప్పులు చూపిస్తా. పెద్ద మొగోడివి అనుకుంటున్నావా? మక్కెలి ఇరిగిపోతాయి అంటున్నావు. చెప్పు పట్టుకుంటేనే మక్కెలి ఇరిగిపోతాయా? ఇదేమైనా సినిమా అనుకుంటున్నావా? నేను చెప్పు చూపించా.. మక్కెలి ఇరిగిపోతాయి అంటున్నా..’’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.
కత్తిపూడిలో వారాహి విజయయాత్ర ను పురస్కరించుకొని ప్రసంగించిన పవన్ కల్యాణ్.. వైసీపీ సర్కారుపై తీవ్రస్థాయిలో ఫైర్ కావటం తెలిసిందే. పవన్ కల్యాణ్ గత వీడియోలను ప్లే చేసిన పేర్ని నాని.. వాటిల్లో మాట్లాడిన మాటలకు.. నిన్న చేసిన ప్రసంగానికి పోలిక చూపిస్తూ.. పవన్ మాటల్లో ఎంత తేడా ఉందో గుర్తించాలన్నారు.
పరిస్థితులకు అనుగుణంగా తన కులాన్ని మార్చేస్తారని.. తగిన ఓట్లు వచ్చే ఛాన్స్ లేకున్నా.. ముఖ్యమంత్రి అయిపోయవాలని కలలు కంటున్నారని విమర్శించారు. పేర్ని నాని షాకింగ్ రియాక్షన్ కుపవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
This post was last modified on June 15, 2023 5:56 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
తెలుగు వారి ఆత్మ గౌరవ నినాదంతో ఏర్పడిన తెలుగు దేశం పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలు సహా తమిళనాడు కర్ణాటకలోని…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…