సీఎం జగన్ హయాంలో వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కేవలం రబ్బర్ స్టాంపులని, నేరుగా జగన్ తో మాట్లాడే అవకాశం వారికి చాలా అరుదుగా లభిస్తుందని ప్రతిపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తుంటారు. ఇటీవల ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల వరకు జగన్ తో భేటీ అయిన ఎమ్మెల్యేల సంఖ్య వేళ్ళ మీద లెక్కబెట్టవచ్చని టీడీపీ నేతలు విమర్శిస్తుంటారు.
ఓ రకంగా చెప్పాలంటే సకల శాఖ మంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పుతున్నారని, ఆయనను దాటి జగన్ దగ్గరికి వెళ్లి తమ అభిప్రాయాలను, తమ నియోజకవర్గ సమస్యలను చెప్పుకోవడం ఎమ్మెల్యేలకు తలకు మించిన పని అని విమర్శలు వచ్చాయి. కానీ, ఇటువంటి సందర్భంలో కూడా కొందరు వైసీపీ నేతలు ధైర్యం చేసి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ సీనియర్ నేత, మంత్రి ధర్మాన ప్రసాదరావు వంటి నేతలు అడపాదడపా ప్రభుత్వంపై నేరుగానే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ధర్మాన ప్రసాదరావు ప్రభుత్వంపై చేసిన విమర్శలు పార్టీని ఇరకాటంలో కూడా పడేశాయి. అయినా సరే తాజాగా మరోసారి తమ ప్రభుత్వం పై ధర్మాన ప్రసాదరావు సంచలన విమర్శలు చేశారు.
గత నాలుగేళ్ల కాలంలో వైసీపీ కార్యకర్తలు ఆర్థికంగా బాగా చితికిపోయారని ధర్మాన అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ కార్యక్రమాల కోసం స్థానిక నేతలు, కార్యకర్తలు ఎంతో ఖర్చు చేశారని, వారికి పైసా కూడా లబ్ధి జరగలేదని ధర్మాన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎక్కడి నుంచో వస్తున్న డబ్బుతో మీటింగ్ లు నిర్వహించడం లేదని, అందువల్ల కార్యకర్తల చేతి చమురు వదులుతోందని ధర్మాన ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే, ప్రజలకు మంచి చేయాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ ప్రభుత్వం పని చేస్తుందని, అవినీతికి తావు లేకుండా లబ్ధిదారులకే నేరుగా అన్ని పథకాలు చేరుతున్నాయని ధర్మాన అన్నారు. తాజాగా మరోసారి ప్రభుత్వంపై ధర్మాన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశయ్యాయి.
This post was last modified on June 15, 2023 8:46 am
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…