Political News

జగన్ ప్రకటనలో లాజిక్కుందా ?

పల్నాడులో జరిగిన ఓ కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో తనకు బీజేపీ మద్దతు కూడా ఉండదన్నారు. నిజానికి బీజేపీ-వైసీపీ మిత్రపక్షాలేమీ కాదన్న విషయం అందరికీ తెలుసు. అయితే కేంద్రప్రభుత్వానికి, రాష్ట్రప్రభుత్వానికి మధ్య మంచి సఖ్యత లేదా అవగాహన ఉందన్నది వాస్తవం. మొదట్లో జగన్ విజ్ఞప్తులను కేంద్రప్రభుత్వం పట్టించుకోకపోయినా కొంతకాలంగా బాగానే మద్దతిస్తోంది. నెలరోజుల వ్యవధిలోనే కేంద్రప్రభుత్వం ఏపీకి సుమారు రు. 24 వేల కోట్లు విడుదల చేయటం అంటే మామూలు విషయంకాదు.

ఎప్పటినుండో పెండింగ్ లో ఉన్న రెవిన్యులోటు రు. 10 వేల కోట్లు, పోలవరం పెండింగ్ బకాయిలు సుమారు రు. 13 వేల కోట్లను కేంద్రం విడుదల చేసింది. తాజాగా జీఎస్టీ వసూళ్ళల్లో ఏపీ షేర్ కింద రు. 4500 కోట్లను విడుదలచేసింది. ఒకవైపు కేంద్రం నుండి ఇంతస్ధాయిలో మద్దతు అందుకుంటు మళ్ళీ బీజేపీ మద్దతు కూడా తనకుండదని జగన్ చెప్పటంలో లాజిక్ కనబడటంలేదు. పార్టీలపరంగా రెండు వేర్వేరు కావచ్చుకానీ ప్రభుత్వాల పరంగా బాగానే సఖ్యతతోనే ఉంటున్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే బీజేపీ వేరు కేంద్రప్రభుత్వం వేరుకాదు. జగన్మోహన్ రెడ్డి వేరు వైసీపీ వేరని, చంద్రబాబునాయుడు వేరు తెలుగుదేశంపార్టీ వేరంటే జనాలు అంగీకరిస్తారా ? అలాగే బీజేపీ అన్నా నరేంద్రమోడీ నాయకత్వంలోని కేంద్రప్రభుత్వం వేర్వేరు కాదని అందరికీ తెలుసు. సడెన్ గా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఇద్దరు తమ బహిరంగసభల్లో జగన్ను టార్గెట్ చేసుకున్నారు.

ఇదే సమయంలో జగన్ మాత్రం బీజేపీని టార్గెట్ చేశారు. అదికూడా తనకు రాబోయే ఎన్నికల్లో బీజేపీ సపోర్టుందని అన్నారంతే. అంటే జగన్ ఉద్దేశ్యంలో టీడీపీ, జనసేనతో బీజేపీ పొత్తుపెట్టుకుంటుందని కావచ్చు. అయితే ఆ విషయాన్ని డైరెక్టుగా కాకుండా ఇన్ డైరెక్టుగా ప్రస్తావించారు. చూస్తుంటే ముందుముందు జరగబోయే సభల్లో బీజేపీని జగన్ డైరెక్టుగానే ఎటాక్ చేస్తారనే అనిపిస్తోంది. అటు బీజేపీ వైపునుండి ఇటు వైసీపీ నుండి ఎటాకులు పెరిగిపోతే జనాలు ఆ వేడికి తట్టుకోలేరేమో.

This post was last modified on June 13, 2023 10:14 am

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

8 hours ago