నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూస్తున్న మోక్షజ్ఞ ఎంట్రీకి రూట్ క్లియరయ్యేలా ఉంది. ఇప్పటికే బాగా సన్నబడిన లుక్స్ తో బాలయ్య ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరిచిన మోక్షజ్ఞ ఒక్క ఫోటోతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. జూనియర్ ఎన్టీఆర్ తరహాలో అతి తక్కువ టైంలో శరీరంలో తెచ్చుకున్న మార్పుకి మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు తన తెరంగేట్రం ఎప్పుడనే దాని మీదే అందరి చూపూ ఉంది. సెప్టెంబర్ 6 మోక్షు పుట్టినరోజు. తాత ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరంలోనే తెరప్రవేశం చేయించే ఆలోచనలో బాలయ్య బలంగా ఉన్నట్టు వినికిడి
ఇప్పటికే యాక్టింగ్, డాన్సులకు సంబందించిన శిక్షణ తీసుకున్న మోక్షజ్ఞకు బ్యానర్ సమస్య లేదు. నాన్న బాలయ్య లేదా ఎవరికి ఎస్ చెప్పినా అగ్ర నిర్మాతలు సిద్ధంగా ఉంటారు. గతంలో వారాహి సాయి కొర్రపాటి రానే వచ్చాడు మా రామయ్య టైటిల్ ని రిజిస్టర్ చేయించి మరీ ఏర్పాట్లు చేసుకున్నారు. ఇది జరిగి ఏళ్ళు గడిచిపోయాయి. తర్వాత తనకు సినిమాల పట్ల ఆసక్తి ఉందో లేదోననే ప్రచారాలు కూడా జరిగాయి. అయితే మొత్తానికి దారి సుగమం చేసుకుని సరైన దర్శకుడి కోసం వెతుకుతున్నారట. చరణ్ ని లాంచ్ చేసిన పూరి జగన్నాధ్ టాప్ ఆప్షన్లలో ఉన్నారు.
దీనికి సంబంధించిన క్లారిటీ రావాలంటే ఇంకో రెండు మూడు నెలలు ఆగాల్సిందే. ఆదిత్య 369 సీక్వెల్ తో మోక్షజ్ఞను పరిచయం చేయాలనే ఆలోచన కూడా బాలయ్యకు ఉంది. అయితే దాన్ని స్వీయ దర్శకత్వం చేయాలని ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే సమయం ఎక్కువ పడుతుంది. దీనికి బదులు ఆ బాధ్యతను వేరే డైరెక్టర్ ఇస్తేనే బెటర్ కాబట్టి ఆ మేరకు ఎవరైతే బాగుంటారనే ఆలోచనలు జరుగుతున్నాయట. అన్నీ కుదిరితే ఒక గ్రాండ్ ఈవెంట్ తో లక్షలాది అభిమానుల సమక్షంలో ఓపెనింగ్ చేసే ప్రతిపాదన నందమూరి ఫ్యామిలీలో ఇప్పటికే చర్చలో ఉందట
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…