జీయర్ సంస్థల నిర్వాహకులు.. ప్రఖ్యాత ఆధ్యాత్మిక వాది చిన్న జీయర్ స్వామి ఢిల్లీకి వెళ్తున్నట్టు తెలిసిం ది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అప్పాయింట్‌మెంట్ తీసుకున్నారని.. మంగళ , బుధవారాల్లో జీయర్ స్వామి.. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్‌షాలతోనూ భేటీ కానున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం బయటకు వచ్చింది. దీనికి సంబందించిన విమాన టికెట్లను కూడా కొనుగోలు చేసినట్టు తెలిసింది.
వాస్తవానికి ఇప్పటి వరకు కూడా.. జీయర్ స్వామి చెంతకు ప్రధాని వచ్చారే తప్ప.. ఒకే ఒక్కసారి సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యమాని ఆహ్వానిస్తూ.. మాత్రమే చిన జీయర్ ప్రధాని, రాష్ట్రపతి వంటివారిని కలుసుకున్నారు. తర్వాత. ఇప్పటి వరకు ఆయన ఢిల్లీ ఛాయలకు పోలేదు. కానీ, ఇప్పుడు ఆకస్మికంగా.. ఆయన ఢిల్లీ యాత్ర చేపట్టారు. అది కూడా ప్రధాని వంటి అగ్రనేతతో భేటీ కానుండడం అత్యంత ప్రాధా న్యం సంతరించుకుంది.
దీనికి ప్రధాన కారణం.. తన మేనల్లుడు.. జీయర్ ఆశ్రమ వ్యవహారాలు చూస్తన్న విష్ణు స్వామిపై ఇటీవల బాంబు లాంటి వార్త బయటకు వచ్చింది. ఆయన ఉదయం స్వామీజీగా.. సాయంత్రం కౌబాయ్‌లా వ్యవహరి స్తున్నారని.. అమ్మాయిలను వెంటేసుకుని తిరుగుతున్నారని వార్తలు వచ్చాయి. ఇవేవీ సాధారణ విషయాలు కావు. అత్యంత ప్రతిష్టాత్మకమైన జీయర్ సంస్థలకు అంతర్జాతీయంగా ఉన్న పేరుపై మచ్చ తెచ్చేవే.
ఈ క్రమంలో జీయర్ స్వామి.. ఇవన్నీ.. తనపై ఉద్దేశ పూర్వకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్ర గా భావిస్తున్నట్టు అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా బయటకు వచ్చిన సమాచారం. ఈ క్రమంలో కేసీఆర్ ప్రభుత్వం ఈ విషయం వెనుక ఉన్నదని.. ఉద్దేశ పూర్వకంగానే.. తమ సంస్థలను బద్నాం చేసే ప్రయ త్నం చేస్తోందని జీయర్ స్వామి భావిస్తున్నట్టు ఆశ్రమ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో నేరుగా ఈ విషయంపై ప్రధానికే ఫిర్యాదు చేయాలని స్వామి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 11, 2023 4:56 pm
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…