ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ సారథి జగత్ ప్రకాష్ నడ్డా చెలరేగిపోయారు. సీఎం జగన్ పేరును మచ్చుకైనా పేర్కొనకుండానే ఆయన వైసీపీ సర్కారుపై నిప్పులు చెరిగారు. వైసీపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ స్కామ్, లిక్కర్ స్కామ్ జరుగుతోందని మండిపడ్డారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని నడ్డా అన్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందని.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని నడ్డా దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం పోవడం వల్లే పనులన్నీ నిలిచిపోయా యని నడ్డా విమర్శించారు. ‘‘ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి ఏంటో చూపిస్తాం. రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా వెనుకబడింది. మాకు అవకాశం ఇస్తే రాయలసీమను ప్రగతి పథంవైపు మళ్లిస్తాం’’ అని నడ్డా హామీలు గుప్పించారు.
మోడీ ఓటు బ్యాంకు రాజకీయం చేయరు!
ప్రధాని మోడీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేయరని జేపీ నడ్డా అన్నారు. ఓటు బ్యాంకు పాలిటిక్స్‌ను బాధ్యతాయుత పాలిటిక్స్ వైపు మళ్లించారని తెలిపారు. ‘‘పేదలు, ఎస్సీలు, రైతుల సంక్షేమం కోసం కేంద్రం కృషి చేస్తోంది. మోడీ ప్రధాని అయ్యేనాటికి విద్యుత్ లేని గ్రామాలు 19 వేలు ఉండేవి. ఇవాళ దేశంలో విద్యుత్ సౌకర్యం లేని గ్రామమే కనిపించదు. గతంలో 59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ కేబుల్ ద్వారా ఇంటర్నెట్ సౌకర్యం ఉండేది. ఇప్పుడు 2 లక్షలకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది’’ అని జేపీ నడ్డా తెలిపారు.
రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనూ అభివృద్ధి కనిపించడం లేదని నడ్డా అన్నారు. ఏపీకి ప్రధాని మోడీ ఏం చేస్తున్నారో వివరించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘కేంద్రం ఇచ్చే ఇళ్లకు వైసీపీ జెండా రంగులు వేసుకుంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం 40 లక్షల ఇళ్లు ఇస్తే.. 20 లక్షలు కూడా నిర్మించలేదు. ప్రజల కోసం నిర్మించే రైల్వే లైన్ల కోసం పావలా వంతు నిధుల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. గ్రామీణ సడక్ యోజన కింద కేంద్రం రోడ్లు వేయిస్తుంటే ప్రభుత్వం ఆ విషయం కూడా చెప్పడం లేదు.’’ అని నడ్డా తీవ్రస్థాయిలో విమర్శించారు.
This post was last modified on June 11, 2023 11:10 am
కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…
రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…
దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…
లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…
వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ప్రధానంగా చర్చకు వస్తున్న పార్టీ. ఈ పార్టీ ప్రభావం నానాటికి తగ్గిపోతోందన్న వాదన ఒకవైపు…
బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…