నెల్లూరు పెద్దారెడ్లు రెడీ అయిపోయినట్లున్నారు. పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధరరెడ్డి సైకిల్ ఎక్కటమే ఆలస్యం. ఎందుకంటే సడెన్ గా శనివారం నెల్లూరు జిల్లా రాజకీయం వేడెక్కింది. శనివారం ఉదయం ఆనం నెల్లూరులోని టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. తమ్ముళ్ళతో సమావేశమయ్యారు. అలాగే కోటంరెడ్డి ఇంటికి సీనియర్ తమ్ముళ్ళిద్దరు అమర్నాధరెడ్డి, బీద రవిచంద్రయాదవ్ వెళ్ళారు. కోటంరెడ్డితో దాదాపు గంటసేపు భేటీ వేశారు.
శనివారం ఉదయం ఆనం డైరెక్టుగా టీడీపీ ఆఫీసుకు వెళ్ళరాంటే ఊరికే వెళ్ళలేదు. శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్ లో చంద్రబాబునాయుడుతో భేటీ అయ్యారు. అన్నీ విషయాలు మాట్లాడుకున్న తర్వాతనే ఆనం నెల్లూరు చేరుకున్నారు. రాత్రంగా తన మద్దతుదారులతోను కొందరు తమ్ముళ్ళతోను మాట్లాడుకున్న తర్వాతే శనివారం ఉదయం పార్టీ ఆఫీసులో ప్రత్యక్షమయ్యారు. ఇక్కడ సమస్య ఏమిటంటే వీళ్ళద్దరు పార్టీలో చేరటంకాదు. రాబోయే ఎన్నికల్లో పోటీచేయటమే కీలకం. ఎందుకంటే ఆనం ఎక్కడినుండి పోటీచేస్తారో తెలీదు.
ఇపుడు వెంకటగిరిలో టీడీపీ ఇన్చార్జిగా మాజీ ఎంఎల్ఏ కురగొండ్ల రామకృష్ణ ఉన్నారు. రామకృష్ణ యాక్టివ్ గానే ఉన్నారు. ఈయన ఆనం రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆనం వచ్చేఎన్నికల్లో వెంకటగిరి, ఆత్మకూరు, నెల్లూరు, ఉదయగిరిలో ఎక్కడ నుండి పోటీచేస్తారో తెలీటంలేదు. అలాగే నెల్లూరు ఎంపీగా పోటీచేసే అవకాశముందనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇక కోటంరెడ్డి వ్యవహారం కూడా కాస్త డౌటుగానే ఉంది.
ఇక్కడ సమస్య ఏమిటంటే కోటంరెడ్డిని నెల్లూరు రూరల్ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అజీజ్ తో పాటు మరికొందర సీనియర్లు కూడా వ్యతిరేకిస్తున్నారట. అయితే ఈ విషయాలన్నీ చంద్రబాబు-కోటంరెడ్డి ముందే మాట్లాడుకుని ఉంటారనటంలో సందేహంలేదు. కాబట్టి కోటంరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్టే ఇస్తారా లేకపోతే ఎంపీగా పోటీచేయించే ఆలోచన ఉందా అన్నదే తేలటంలేదు. ఏదేమైనా ఇద్దరు వైసీపీ రెబల్ ఎంఎల్ఏలు సైకిల్ ఎక్కే ముహూర్తం నిర్ణయమైనట్లే ఉంది. ఆ ముహూర్తం ఎప్పుడు ? ఎక్కడినుండి పోటీచేస్తారనే విషయమే ప్రకటించాల్సుంది.
This post was last modified on June 10, 2023 10:13 pm
హైదరాబాద్ ఫుడ్ కు దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ గా మంచి క్రేజ్ ఉంది. సెలబ్రెటీలులకు సైతం గౌరవం ఎక్కువ.…
సూపర్ స్టార్ మహేశ్ బాబు లేటెస్ట్ లుక్ ప్రస్తుతం అభిమానుల మధ్య హాట్ టాపిక్ అయింది. ఇటీవలి కాలంలో గడ్డం,…
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…