తెలంగాణలో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలపై బీజేపీ నాయకులు.. జిల్లాల్లో ఒక ప్రచారం చేస్తున్నా రు. వీటిని కేంద్రప్రభుత్వమే మంజూరు చేసిందని వారు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్టుగానే రాష్ట్రానికి కూడా మెడికల్ కాలేజీలను ఇచ్చిందని బీజేపీ నేత లు ప్రచారం చేస్తున్నారు. అయితే.. ఈ క్రమంలో అసలు వాస్తవం ఏంటనేది కేసీఆర్ ప్రభుత్వం తాజా గా `ఫ్యాక్ట్ చెక్` పేరుతో పెద్ద ఎత్తున ప్రచారంలోకి దిగింది.
రాష్ట్ర ప్రభుత్వమే సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తూ తప్పుడు ప్రచారం జరుగుతోందని పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వాస్తవాన్ని వివరించే ప్రయత్నం చేసింది. ఈ ఏడాది నేషనల్ మెడికల్ కమిషన్ దేశవ్యాప్తంగా 50 మెడికల్ కాలేజీలకు అనుమతులు మంజూరు చేసిందని, వీటిలో ప్రభుత్వ, ప్రైవేట్, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే కాలేజీలు ఉన్నాయని పేర్కొంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీలతో పాటు మరో 4 ప్రైవేట్ కాలేజీలకు NMC అనుమతులు ఇచ్చిందని తెలిపింది. వీటినే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోం దని .. కేసీఆర్ సర్కారు వివరించింది. ఆ సంస్థలు అన్ని రూల్స్, రెగ్యులేషన్స్ పాటిస్తున్నారని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న 9 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు మంజూరు చేయలేదని తెలిపింది.
కేవలం అనుమతులు మంజూరు చేయడాన్ని, కేంద్ర ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినట్టు అర్థం వచ్చేలా కొందరు ప్రజా ప్రతినిధులు సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఇదిలావుంటే, రాష్ట్ర బీజేపీ నాయకులు.. కొందరు కేంద్రమే ఈ కాలేజీలను నిర్మిస్తోందని చెబుతుండగా.. కేంద్రం నుంచి తరచుగా వస్తున్న మంత్రులు మాత్రం .. తాము మెడికల్ కాలేజీలు ఇస్తామని చెబుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం స్పందించడం లేదని చెబుతున్నారు. మొత్తంగా ఈ పరిణామం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎన్నికల ముందు బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టలేక సతమతం అవుతున్న విషయం ప్రస్తావనకు వస్తుండడం గమనార్హం.
This post was last modified on June 10, 2023 12:15 pm
ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…
ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి పార్టీలు ఎన్ని స్థానాల్లో గెలవబోతున్నాయి? వైసీపీకి ఎన్ని స్థానాలు…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…