జీయర్ ఆశ్రమం.. ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో కొత్తకాదు. పల్లెల అభివృద్ధి నుంచి నిరక్ష్యరాస్యతను తగ్గించే వరకు కూడా అనేక రూపాల్లో జీయర్ ఆశ్రమం చేసిన చేస్తున్న సేవలు దేశాంతర ఖ్యాతిని సముపార్జించు కున్నాయి. సుమారు 8 దశాబ్దాలుగా ఈ సేవలు దేశానికి, రాష్ట్రానికి కూడా అందుతున్నాయంటే అతిశయో క్తి కాదు. అయితే.. ఇన్ని సేవలు చేసినా.. ఎన్ని రకాలుగా సమాజానికి ఉపయోగపడినా.. ఎప్పుడు ఒక్క మాట కూడా పడకుండా.. జీయర్ ఆశ్రమం ముందుకుసాగింది.
ఇలాంటి సమయంలో ఇప్పుడు ఒక్కసారిగా కడివెడు కుండ పాలలో చిన్న ఉప్పుగల్లు మాదిరిగా రేగినపెను తుఫాను జీయర్ చరిత్రపై మరకలు పడేలా చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఆశ్రమంలో చినజీయర్ స్వామి తరువాత అంత పవర్‌ఫుల్ అయిన ఆయన మేనల్లుడు విష్ణు స్వామి వ్యవహారం అనూహ్యంగా ఆశ్రమ కార్యక్రమాలు, కార్యకలాపాల విషయంలో తీవ్ర వివాదంగా మారిందని అంటున్నారు పరిశీలకులు.
ప్రస్తుతం విష్ణు స్వామి జీయర్ విద్యా సంస్థలకు సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నారు. ఆశ్రమానికి వచ్చిన కొత్తల్లో.. విష్ణు స్వామి అక్కడ ఫోటోలు తీసి మీడియాకు అందిస్తుండే వారు. తరువాత కాలంలో జీయర్ ఆశ్రమానికి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం కల్పించే బాధ్యత తీసుకున్నారు. చినజీయర్ స్వామి ఉత్తరాధికారి విష్ణు స్వామే అనే ప్రచారం సాగుతోంది. అయితే.. విష్ణు స్వామి.. పగలు స్వామి వేషంలోనూ తర్వాత.. సాయంత్రం వేళ.. ఆయన పబ్బులకు, క్లబ్బులకు తిరుగుతుంటానే ప్రచారం బయటకు వచ్చింది.
ఇది చిన్న విషయమేమీ కాదు. ఎందుకంటే.. జీయర్ ఆశ్రమాలకు.. ఇక్కడి నియమాలకు ఉన్న పేరు అఖండ ప్రపంచాన్ని సైతం ఆకర్షించింది. అమెరికాలోనూ అనేక ఆశ్రమాలు ఉన్నాయి. అలాంటి సంస్థ లో ఇప్పుడు విష్ణు స్వామి వ్యవహారం వివాదంగా మారడం గమనార్హం. మరి దీనిపై చినజీయర్ ఎలా వ్యవహారిస్తారో.. ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on June 10, 2023 12:11 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…