గత ఎన్నికలకు ముందు వైసీపీ అధినేత జగన్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా జగనన్న ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇళ్లను నిర్మిస్తున్నారు. పేదలకు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణాలు, నగరాల్లో సెంటు చొప్పున స్థలం కేటాయించారు. ఇదే సమ యంలో రాజధాని ప్రాంతంలో కూడా జగన్ ప్రభుత్వం పెద్ద ఎత్తున స్థలాలను ఈ నెలలోనే కేటాయించింది. ఇప్పుడు ఇక్కడ ఇళ్లను కేవలం 90 రోజుల్లో నిర్మించేందుకు నిధులు కూడా కేటాయించింది.
అయితే,వాస్తవానికి ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పటికీ పునాదులుకూడా పడలేదు. పడిన చోట కూడా.. పునా దులు లేచిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉంది. ఇక, మరోవైపు, సీఎం సొంత జిల్లా కడపలో నూ పునాదుల స్థాయి దాటలేదు. కానీ, రాజధాని ప్రాంతంలో పట్టుమని 15 రోజులు కూడా కాకముందే.. ఇళ్లను 90 రోజుల్లోనే నిర్మించేందుకు సీఎం జగన్ ఏకంగా రెండు వేల కోట్ల రూపాయలను విడుదల చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.
ఆర్-5 జోన్ ఏర్పాటు, సెంటు పట్టాల పంపిణీతో తీవ్రంగా దెబ్బతిన్న రాజధాని రైతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల బాంబు వేసేందుకు సిద్ధమవుతోంది. సీఆర్డీఏ పరిధిలోని నిడమర్రు, కురగల్లు, దొండపాడు, మందడం, కృష్ణాయపాలెం, ఐనవోలు గ్రామాల్లో ఇటీవల పంపిణీ చేసిన సెంటు స్థలాల్లో జూలై 8 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇళ్ల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
తొలుత లబ్ధిదారులకు సర్వే కోడ్ ఇచ్చి ప్రభుత్వమే ఇల్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్-3కి సంబంధించి కాంట్రాక్టర్లతో ఎంవోయూలు, బ్యాంకు అకౌంట్లు ప్రారంభించాలని సూచించింది. ఇళ్ల నిర్మాణం ప్రారంభించేందుకు వీలుగా నీరు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు టెండర్ ప్రక్రియ, లబ్ధిదారులకు రుణాలు అందజేసేలా వెంటనే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే… జిల్లాల పరిధిలో ఎలా ఉన్నా.. రాజధానిని నిర్వీర్యం చేయాలనే లక్ష్యంలో భాగంగానే ప్రభుత్వం ఇక్కడ యుద్ధ ప్రాతిపదికన ఇళ్లను నిర్మిస్తోందనే ప్రచారం జరుగుతుండడం.. టీడీపీ నేతలు కూడా ఇదే వాదన వినిపిస్తుండడం గమనార్హం.
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…