ఏపీలో గడిచిన మూడున్నరేళ్లుగా తీవ్ర వివాదంగా.. తీవ్ర చర్చనీయాంశంగా మారిన విషయం.. రాజధాని అమరావతి. చంద్రబాబు హయాంలో దీనికి 2015లో శంకుస్థాపన జరిగిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత.. రాజధాని లేకుండా ఏర్పడిన ఏపీకి అత్యద్భుతమైన నగరం రాజధానిగా ఉండాలని తలపోసిన అప్పటి సీఎం చంద్రబాబు.. దానికి అనుగుణంగానే 33 వేల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతుల నుంచి సేకరించారు. దీనిని అభివృద్ధి చేసేందుకు సింగపూర్, దుబాయ్ దేశాలకు చెందిన కన్సల్టెన్సీలను కూడా రప్పించారు. ఇక, ఇక్కడే సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టును నిర్మించారు.
మరిన్ని పనులు పరుగులు పెట్టే దశలో ఉండగా.. 2019లో వచ్చిన ఎన్నికల్లో టీడీపీ ఓటమి బాటపట్టి.. వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఇక, అప్పటి నుంచి సీఎం జగన్ మూడు రాజధానులు అంటూ ప్రకటనలు చేయడం.. విశాఖను రాజధాని చేస్తానని అక్కడే కాపురం ఉంటానని కూడా ప్రకటించారు. దీంతో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమానికి దిగారు. అనేక పాదయాత్రలు చేశారు. ఇప్పటికీ.. దీక్షలు కొనసాగుతున్నాయి. మరో 9 నెలల్లో ఎన్నికలు ఉన్నాయి. రాష్ట్ర ప్రజలకు ఒక రాజధాని నగరం లేకుండా పోయిందనే వాదన సర్వత్రా వినిపిస్తోంది.
ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమరావతి విషయంలో ఆందోళన అక్కర్లేదని, టీడీపీ అధికారంలోకి రాగానే పనులు పరుగులు పెట్టిస్తామని చంద్రబాబు అన్నారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐటీడీపీ కార్యకర్తల సదస్సులో పాల్గొన్న ఆయన.. టీడీపీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రతి విషయం చాలా విలువైందని, ప్రతి ఒక్కరికీ వీటిని చేరువ చేయాలని ఐటీడీపీ కార్యకర్తలకు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు రాజధాని అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏపీలోనూ హైదరాబాద్‌కు దీటుగా మరో నగరం కట్టాలని సంకల్పించామన్నారు.
అమరావతి కోసం రైతులు 34 వేల ఎకరాలు ఇచ్చారని, అందుకే అక్కడ అమరావతి వంటి సన్‌రైజ్ స్టేట్‌లో గొప్ప రాజధాని ని ఏర్పాటు చేయాలని సంకల్పించామన్నారు. పార్టీ పై విశ్వాసంతోనే 29 వేల మంది రైతులు భూములిచ్చారన్న చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతిలో పనులు పరుగులు పెట్టిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా ఐటీడీపీ సదస్సులో ఉన్నవారు తమ కరతాళ ధ్వనులతో మోతెక్కించడం గమనార్హం. కాగా, వాస్తవానికి ఇటీవల జరిగిన మహానాడులోనే చంద్రబాబు అమరావతిపై మాట్లాడతారని చాలా మంది ఎదురు చూశారు. కానీ, ఎందుకో అక్కడ మిస్సయ్యారు.
This post was last modified on June 9, 2023 10:20 pm
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఇండిగో విమాన సేవలు రద్దయి.. కొన్ని విమానాలు తీవ్ర ఆలస్యమై.. లక్షల సంఖ్యలో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కొత్త హీరో హీరోయిన్లు.. కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమాకు వంద కోట్లకు పైగా వసూళ్లు రావడం అనూహ్యం. ఉప్పెన సినిమా…