Political News

మోదీకి కేటీఆర్ మ‌ద్ద‌తు…ష‌ర‌తు‌లు వ‌ర్తిస్తాయి

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీల మ‌ధ్య మాల యుద్ధం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలంగాణ‌లో బ‌ల‌ప‌డాల‌ని చూస్తున్న బీజేపీ ఈ క్ర‌మంలో అందివ‌చ్చే ప్ర‌తి అవ‌కాశాన్ని ఉప‌యోగించుకుంటోంది. మ‌రో వైపు టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో బీజేపీని టార్గెట్ చేయ‌డంలో ఏ మాత్రం వెన‌క‌డుగు వేయ‌డం లేదు.

తాజాగా బీజేపీ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావించే అయోధ్య‌లో రామ‌మందిరం విష‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. బీజేపీ నేత‌లు ప్ర‌వ‌చించే రామ‌రాజ్యానికి జై కొడుతూనే….త‌మ‌దైన ష‌ర‌తులు పెట్టారు.

సోష‌ల్ మీడియాలో ప్ర‌జ‌ల‌తో అనుసంధానం అవ‌డంలో క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించే కేటీఆర్ తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా, ఆస్క్ కేటీఆర్ పేరుతో క‌నెక్ట్ అయ్యారు. నెటిజ‌న్లు అడిగిన ప‌లు ప్ర‌శ్న‌ల‌కు జ‌వాబులు ఇచ్చారు. అయోధ్య రామమందిరం నిర్మాణానికి తెలంగాణ యొక్క భాగస్వామ్యం ఏమిటన్న ప్రశ్నకు మంత్రి కేటీఆర్ ఆస‌క్తిక‌ర స‌మాధానం ఇచ్చారు.

భారత రాజ్యాంగ విలువలకు అనుగుణంగా కుల,మత, తరగతులకు అతీతంగా అందరికీ సమానమైన అవకాశాలు, గౌరవం వంటి లభించే రామ రాజ్యం రావాలి అని త‌న ఆకాంక్ష‌‌ను మంత్రి కేటీఆర్ వ్య‌క్తం చేశారు. త‌ద్వారా బీజేపీ మ‌ద్ద‌తు ఇచ్చే సిద్ధాంతానికి పూర్తి మ‌ద్ద‌తు ఇ్వ‌వ‌కుండా… అన్ని వ‌ర్గాల కోణంలో దానికి సంఘీభావం వ్య‌క్తం చేశారు.

మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌క‌మైన ఆయుష్మాన్ భారత్ గురించి సైతం కేటీఆర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్ పథకం కన్నా రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శ్రీ అత్యుత్తమమైన స్కీమ్ అని పేర్కొన్నారు. ఇంకా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వం యొక్క పథకం రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య శ్రీ నమూనా పైన ఆధారపడి ఉందని తెలిపారు.

This post was last modified on August 10, 2020 6:59 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

26 minutes ago

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

1 hour ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

2 hours ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

3 hours ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

3 hours ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

3 hours ago