మార్గదర్శి మోసాలపై నమోదు చేసిన అన్ని కేసులు ఏపీ హైకోర్టుకు బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. మార్గదర్శి ఖాతాదారులను దృష్టిలో పెట్టుకుంటే లక్షల్లో ఉన్నారు. వీళ్ళంతా ఏపీ, తెలంగాణా, కర్నాటకతో పాటు కొందరు తమిళనాడు, కేరళలో కూడా ఉన్నారు. అయితే ఏపీ, తెలంగాణా, కర్నాటకలోనే లక్షల్లో ఉన్నారు. మార్గదర్శిలో మోసాలు జరిగాయని సీఐడీ కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఛైర్మన్ రామోజీరావును ఏ1 గా కోడలు, ఎండీ శైలజను ఏ2గా సీఐడీ కేసులు నమోదుచేసి విచారిస్తోంది.
ఇక్కడ సమస్య ఏమిటంటే ఖాతాదారులు, బ్రాంచీలు ఎక్కువగా ఏపీలో ఉన్నాయి. కాబట్టి సీఐడీ నమోదు చేసిన కేసులు కూడా ఏపీకి సంబంధించనవే ఎక్కువ. అయితే సంస్ధ కార్పొరేట్ ఆఫీస్, ఛైర్మన్, ఎండీ, బోర్డాఫ్ డైరక్టర్లంతా హైదరాబాద్ లో ఉంటారు. అందుకనే ఏపీలో నమోదైన కేసులపై ఛైర్మన్, ఎండీ తదితరులను విచారించాలంటే కష్టంగా ఉంది.
ఏపీలో మోసాలు జరిగిందని చెప్పి హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆఫీసులు తనిఖీలు చేయటం ఏమిటని, తమపై ఎలాంటి యాక్షన్ తీసుకోకూడదని రకరకాల కారణాలను చూపి రామోజీ కేసులు వేశారు. అయితే వీటిని తెలంగాణా హైకోర్టు పట్టించుకోలేదు. అందుకనే మార్గదర్శి బ్రాంచీలలో జరిగిన మోసాలకు ఛైర్మన్ గా తనకు ఎలాంటి సంబంధం లేదని బ్రాంచ్ మేనేజర్లనే బాధ్యులను చేయాలని అడ్డుగోలుగా వాదించారు. దీన్ని కూడా హైకోర్టు పట్టించుకోలేదు.
కార్పొరేట్ ఆఫీస్ లో సోదాలు చేసుకోవచ్చని, విచారణ చేసుకోవచ్చని చెప్పింది. దాని ప్రకారమే సీఐడీ ఇప్పటికే రామోజీ తో పాటు శైలజను రెండుసార్లు విచారించింది. అయితే విచారణను స్పీడు పెంచేందుకే మార్గదర్శి కేసులన్నింటినీ ఏపీ హైకోర్టులోకి మార్చాలని ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటీషన్ వేసింది. అన్నీ కేసులు ఏపీ హైకోర్టులోనే విచారించేట్లయితే తమ దర్యాప్తు స్పీడందుకుంటుందని ప్రభుత్వం పిటీషన్లో చెప్పింది. ఇప్పటికే తమ విచారణలో భాగంగా రు. 793 కోట్ల ఆస్తులను ప్రభుత్వం ఎటాచ్ చేసింది. ఏపీ ప్రభుత్వం వాదనతో సుప్రీంకోర్టు ఏకీభవిస్తే దర్యాప్తు మరింత స్పీడందుకుంటుంది.
This post was last modified on June 6, 2023 11:07 am
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…