వైసీపీ వ్యూహాలు మారుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు వ్యూహం కూడా పూర్తిస్థాయిలో మారేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మరో 10 మాసాల్లో ఎన్నికలు జరగనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల వచ్చినా లేదా షెడ్యూల్ ప్రకారం 2024 మార్చిలోనే ఎన్నికలు జరిగినా కూడా ఈ ఉండేటటువంటి మధ్యకాలం అంతా కూడా ఇరు నాయకులు అటు చంద్రబాబు నాయుడు ఇటు జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లో ఉండేలా వ్యూహాలు రచిస్తున్నట్టు సమాచారం.
ప్రస్తుతానికి చూసుకుంటుంటే చంద్రబాబునాయుడు మినీ మేనిఫెస్టో ప్రకటించారు. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. కానీ మరోవైపు చంద్రబాబు నాయుడు కూడా వ్యూహాత్మకంగా వ్యవహరించి తాను కూడా జిల్లాల వారీగా అవసరమైతే మండలాల వారీగా కూడా యాత్రలు చేయాలి లేదా ప్రజల్లోకి వెళ్లాలి, బస్సు యాత్రలు చేయాలని అనే లక్ష్యాన్ని నిర్ణయించుకున్నారని సమాచారం.
ఇక ప్రస్తుతం టిడిపి ప్రకటించినటువంటి మేనిఫెస్టో చూసిన తర్వాత వైసీపీ అధినేత జగన్ కూడా ప్రజల్లో ఉండాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా వైసిపిలో టిడిపి మినీ మేనిఫెస్టో కలవరం రేపిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రజలు ఉచితల వైపు మళ్ళించినటువంటి పాపం వైసిపిదే. ఇప్పుడు అదే ఉచిత పథకాలను చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అంటే దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం వైసీపీ కనిపించడం లేదు.
అలాగని అలా చూస్తూ వదిలేస్తే.. ప్రజలు వైసిపి నుంచి దూరమై టిడిపికి మళ్లుతారని ఓ వర్గం వైసీపీ నాయకులు భావిస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికలకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలని చెబుతున్నారు. ఈ పది మాసాలు ప్రజల్లోనే ఉండేలా ముఖ్య నాయకులు అందరూ కూడా వైసిపి అధినేత కానివ్వండి మంత్రులు కానీ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే మంత్రులని గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలోతిప్పుతున్నారు.
ఇది చాలదు మరింతగా ప్రజలను కలవడంతో పాటు టీడీపీ మేనిఫెస్టోని ఎండగట్టాలి అనేటటువంటి వ్యూహాత్మక ఆలోచనదిశగా వైసిపి అధిష్టానం కదులుతున్నట్టు తెలుస్తోంది. వైసిపి, టిడిపి రెండు కూడా వచ్చే ఎన్నికలకు పది మాసాల ముందే ప్రజల మధ్య ఉండి ప్రజలతో మమేకమై ప్రజలను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు మరింత ఎక్కువగా చేయనున్నాయి. అయితే ప్రజలు ఎటు మొగ్గుతారు అనేది చూడాలి.
వైసిపి ఇప్పటికే ఇస్తున్న పథకాలు చూసి వైసిపి వైపే ఉంటారా చంద్రబాబునాయుడు ఇస్తానంటున్న పథకాలను చూసి చంద్రబాబు నాయుడు వైపు మొగ్గుతారా అనేది ఆసక్తిగా మారింది ఎలా చూసుకున్నప్ప టికీ కూడా వైసిపి టిడిపిలు కూడా రెండు ప్రజల మధ్య ఉంటాయనేది వాస్తవం. దీనికి సంబంధించి ఎప్పటికి ఒక గ్రాఫ్ ను టిడిపి నిర్ణయించుకోగా వైసిపి రెండు మూడు రోజుల్లోనే దీనికి సంబంధించి ఒక మాస్టర్ ప్లాన్ ప్రకటించే అవకాశం ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on June 5, 2023 4:50 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…