Political News

వాళ్లంతా డ‌మ్మీలే.. స‌ర్వ‌స్వం.. తాడేప‌ల్లే: ఆనం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

జ‌నాలూ.. నా మాట వినండి.. అంటూ మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి పిలుపునిచ్చారు. వ‌చ్చేఎన్నిక‌ల్లో వైసీపీని ఓడించాల‌ని ఆయ‌న సూచించారు. రాష్ట్రంలో సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన నడుస్తోందని, ఈ దుర్మార్గపు, దౌర్భాగ్యపు పాలన అంతానికి అందరూ నడుం బిగించాలని అన్నారు. చట్టసభల్లో జరగాల్సిన నిర్ణయాలు, ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంప్ కార్యాలయం వేదికగా సాగుతున్నాయని తెలిపారు.

ప్రభుత్వ కార్యకలాపాలన్నీ క్యాంపు కార్యాలయంలో సాగుతున్నాయని, ఏడాదికి ఒకసారి జరిగే బడ్జెట్ సమావేశాలు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదని, కనీసం 15 రోజులు కూడా నిర్వహించడం లేదని తెలిపారు. సుపరిపాలన పేరుతో అప్రజాస్వామిక పాలన రాష్ట్రంలో నడుస్తోందని, ఏదీ రాజ్యాంగపరంగా జరగడం లేదని చెప్పారు. దోపిడీకి ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని తెలిపారు. శాసన సభ నుంచి గ్రామ పంచాయతీ సభల వరకూ దేనికీ విలువలు లేవు అని పేర్కొన్నారు.

గతంలో 60 రోజులు జరిగే శాసన సభ సమావేశాలు 15 రోజులకు తగ్గిపోయాయని ఆనం తెలిపారు. ప్రజల అవసరాలు‌ పట్టించుకోవటం లేదని, ప్రాజెక్టుల పనులు జరగడం లేదని, జిల్లా స్థాయి సమావేశాల్లో కూడా పరిపూర్ణత లేదని అన్నారు. అందుకనే వాటికి వెళ్లడం లేదు.. ఏ అధికారి కూడా స్వతంత్రంగా వ్యవహరించే పరిస్థితి లేదని తెలిపారు. వాలంటీర్లకే సర్వ హక్కులు ఉన్నాయన్న ఆనం.. తాజాగా గృహ సారథులు వచ్చారని అన్నారు.

మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సర్పంచ్లకు కూడా అధికారాలు లేవని చెప్పారు. మన రాష్టంలో మందు తాగే వాళ్లకు లివర్, కిడ్నీలు పాడై పోయి ఆ కుటుంబాలు వీధిన పడుతున్నాయని, జగన్ ప్రభుత్వం మళ్లీ అప్పుల కోసం రిజర్వ్ బ్యాంక్ చుట్టూ తిరుగుతోందని ఎమ్మెల్యే ఆనం తెలిపారు. ఈ నేప‌థ్యంలోనే జ‌నాలు బాగా ఆలోచించి.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీని నిలువ‌రించి.. త‌గిన బుద్ధి చెప్పాల‌ని పిలుపునిచ్చారు.

This post was last modified on June 5, 2023 2:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

1 hour ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

2 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

4 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

9 hours ago