ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కొండెపి నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే డోలా బాల వీరాంజనేయ స్వామిని పోలీసులు అత్యంత అమానుష రీతిలో అరెస్టు చేశారు. బలవంతంగా పోలీసు వాహనంలోకి ఎక్కించి ఆయనను అరెస్టు చేయడం.. తీవ్ర వివాదానికి దారితీసింది. దీంతో నియోజకవర్గం వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. నెల్లూరులో ఆనం వెంకట రమణారెడ్డిపై దాడి ఘటన మరువకముందే.. ఇలా టీడీపీ ఎమ్మెల్యే అరెస్టు కలకలం రేపడం గమనార్హం.
ఏం జరిగిందంటే..
కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిని ముట్టడించడానికి వైసీపీ ఇన్‌చార్జి వరికూటి అశోక్ బాబు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వంలో స్వచ్ఛభారత్ నిధులు ఎమ్మెల్యే స్వామి దుర్వినియోగం చేశాడని ఆరోపించారు. చలో తూర్పు నాయుడుపాలెం అంటూ.. ఎమ్మెల్యే స్వామి ఇంటి ముట్టడికి అశోక్ బాబు పిలుపునిచ్చారు.
వైసీపీకి కౌంటర్‌గా చలో టంగుటూరు కార్యక్రమానికి టీడీపీ పిలుపునిచ్చింది. తూర్పు నాయుడుపాలెంలో ఎమ్మెల్యే స్వామి ఇంటి వద్దకి టీడీపీ శ్రేణులు చేరుకున్నాయి. వరికూటి అశోక్ బాబు తీరుని నిరశిస్తూ నాయుడుపాలెం నుంచి ఎమ్మెల్యే స్వామి, టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీగా టంగుటూరు బయలు దేరారు. అయితే జాతీయ రహదారిపై టీడీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ శ్రేణులకు, పోలీసులకు తోపులాట జరిగింది.
ఈ తోపులాటలో టీడీపీ ఎమ్మెల్యే స్వామి చొక్కా చిరిగింది. చివరకు ఎమ్మెల్యే స్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. టంగుటూరు వెళ్లాల్సిందే అంటూ జాతీయ రహదారిపై వాహనాలను టీడీపీ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మరోవైపు.. జిల్లాలోని కొండేపి నియోజకవర్గంలో టీడీపీ, వైసీపీల మధ్య హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న పరిస్థితి నెలకొనడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
This post was last modified on June 6, 2023 12:22 pm
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…