కడపలో ఉన్న 10 అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీని గెలిపించాలని టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారాలోకేష్ ప్రజలను కోరారు. 2024 ఎన్నికల్లో అదే 10 సీట్లు టీడీపీకి ఇవ్వండి అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తాం.. చెయ్యకపోతే కాలర్ పట్టుకొని నన్ను నిలదీయండి
అని వ్యాఖ్యానించారు. టీడీపీ రాజంపేట పార్లమెంటు నుంచి 12 సార్లు బలిజ వ్యక్తిని పార్లమెంటుకు పంపిస్తే, జగన్ రెడ్డి రాజంపేట ఎంపీ సీటును మిథున్ రెడ్డికి కట్టబెట్టి బలిజలను వంచించారని విమర్శించారు.
తిరుపతి అసెంబ్లీ సీటును తెలుగుదేశం పార్టీ బలిజలకు కేటాయిస్తే, జగన్ రెడ్డి సొంత వర్గానికి కట్టబెట్టా డని అన్నారు. బలిజ వర్గానికి చెందిన సి.రామచంద్రయ్యకు రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కల్పించామని లోకేష్ గుర్తు చేశారు. బలిజల అభ్యున్నతి కోసం టీడీపీ విశేషంగా కృషి చేసిందని అన్నారు. గతంలో అమలు చేసిన రిజర్వేషన్ కి కట్టుబడి ఉన్నామని, జగన్ కక్ష తో కాపు కార్పొరేషన్ ని నిర్వీర్యం చేశారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో బలిజలకు పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తామని వారిని గెలిపించుకోవాలని కోరారు.
కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం భూమయ్యగారి పల్లి క్యాంప్ సైట్ వద్ద బలిజ సామాజిక వర్గాలతో నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. బలిజలు జగన్ చేతిలో బాధితులుగా మారారని.. రాయల సీమలో బలిజల్ని జగన్ ప్రభుత్వం పట్టించు కోలేదని అన్నారు. తన పిల్లలు విదేశాల్లో చదివితే చాలు.. పేద విద్యార్థులు విదేశాల్లో చదవకూడదు అనే ఆలోచనలో జగన్ విదేశీ విద్య పథకం రద్దు చేశారని విమర్శించారు.
గతంలో కాపులకు అమలు చేసిన రిజర్వేషన్కి కట్టుబడి ఉన్నామన్న లోకేష్… జగన్ కక్ష పూరిత వైఖరితో కాపు కార్పొరేషన్ని నిర్వీర్యం చేశారనీ పేర్కొన్నారు. జగన్ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని భ్రష్టు పట్టించి తల్లిదండ్రులు, విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నాడని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. సీఎం సొంత జిల్లా అంటే ఎలా అభివృద్ధి చెందాలి? కేవలం జయంతి, వర్ధంతికి తప్ప కడప జగన్కి గుర్తు రావడం లేదని విమర్శించారు.
This post was last modified on June 5, 2023 11:29 am
డైరెక్ట్ చేసినవి మూడే మూడు చిత్రాలు. కానీ నాగ్ అశ్విన్ రేంజే వేరు ఇప్పుడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ లాంటి చిన్న…
ఎన్టీఆర్ జిల్లాలోని మూలపాడు సమీపంగా భారీ క్రీడా నగరాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేసింది. కృష్ణా నది…
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాల ప్రభావం నుంచి భారత స్టాక్ మార్కెట్ బయటపడిన మొదటి మార్కెట్‌గా…
హాస్య నటులు హీరోలు కావొచ్చేమో కానీ యాంకర్లు కథానాయకులుగా వెలుగొందటం అంత సులభం కాదు. నాలుగేళ్ల క్రితం ప్రదీప్ మాచిరాజు…
ప్రముఖ అమెరికన్ గాయని కేటీ పెర్రీ ఇప్పుడు ఒక అరుదైన ఘనతను సాధించారు. ఆమె మరో ఐదుగురు మహిళలతో కలిసి…
మ్యాన్‌హోల్‌లోకి దిగుతూ ప్రాణాలు కోల్పోయే పారిశుద్ధ్య కార్మికుల ఘటనలు ఈ మధ్య కాలంలో మరింత ఎక్కువయ్యాయి. అత్యంత ప్రమాదకరమైన ఈ…