బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయిన తర్వాత.. అనేక విశ్లేషణలువ స్తున్నాయి. ఏపీలోనూ.. వచ్చే తెలంగాణ ఎన్నికల్లోనూ బీజేపీతో పొత్తు విషయంలో చంద్రబాబుతో చేతులు కలిపేందుకు బీజేపీ పెద్దలు మంతనాలు జరిపారన్నది ప్రధాన చర్చ. అయితే.. ఏపీ విషయాన్ని పక్కన పెడితే.. తెలంగాణలో ఉన్న రాజకీయ సెన్సిటివిటీని, ఇక్కడి సెంటిమెంటును ఇప్పటికే కాచి వడబోసిన బీజేపీ పెద్దలు ఈ విషయాన్ని తెలుసుకోకుండా ఉంటారా? అన్నది ప్రశ్న.
2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో చంద్రబాబు-కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇది.. అప్పటికి అంతో ఇంతో వ్యతిరేకత ఉందని భావించిన టీఆర్ఎస్‌కు మేలు చేసింది. “అదిగో ఏపీ నుంచి వచ్చేస్తున్నారు. మన మీద పెత్తనం చెలాయిస్తారు. మరి మనమే తేల్చుకోవాలి. మన నీళ్లు మన ఉద్యోగాలు. మనో ఓట్లు” అంటూ.. సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నిజానికి ఆ ఎన్నికల్లో ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనుల కంటే.. లేదా.. ప్రభుత్వ వ్యతిరేకత కంటే కూడా.. చంద్రబాబు-కాంగ్రెస్ కలయికే పెద్ద చర్చగా మారింది.
చివరకు 2018 ఎన్నికల ఫలితం కంటే కూడా.. మరింత ఎక్కువ సీట్లలో కేసీఆర్ విజయం దక్కించుకున్నారు. కట్ చేస్తే.. ఈ విషయం తెలిసిన బీజేపీ.. ఇప్పుడు పోయిపోయి.. చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో విజయం సాధిస్తుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. చంద్రబాబు తనను తాను ఎంతగా తెలంగాణను అభివృద్ధి చేశామని చెప్పుకొన్నా.. కేసీఆర్ స్థానిక సెంటిమెంటు ముందు నిలవడం కొంత కష్టమైన వ్యవహారం. పైగా.. గతంలో కాంగ్రెస్‌తోను.. ఇప్పుడు బీజేపీతోనూ చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయం కూడా కేసీఆర్ ప్రజల్లోకి తీసుకువెళ్లడం ఖాయం.
ఈ పరిణామాలను గమనిస్తున్న బీజేపీ రాష్ట్ర నేతలు.. ముందుగానే అప్రమత్తమయ్యారు. ఈ పొత్తులపై ఊహాజనిత కథనాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నాయకుల హోదాలో మమతా బెనర్జీ, స్టాలిన్, నీతీశ్‌కుమార్‌లు కూడా మోడీ, అమిత్‌షాలను కలిశారని గుర్తు చేశారు.
This post was last modified on June 5, 2023 2:38 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…