ఇపుడీ విషయంపైనే సనత్ నగర్ నియోజకవర్గంలో జోరుగా చర్చ జరుగుతోంది. మంత్రి తలసాని శ్రీనివాసరావుకు మాస్ లీడర్ గా పేరుంది. క్యాడర్ బేస్డు లీడర్ గా పేరున్న తలసానికి నియోజకవర్గంలో మంచి పట్టుంది. అలాంటిది ఇపుడు ఇంత సడెన్ గా హ్యాట్రిక్ విజయంపై ఎందుకింత చర్చ జరుగుతోంది ? ఎందుకంటే హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగా తయారైందట. కారణం ఏమిటంటే మద్దతుదారుల్లో చాలామంది బీఆర్ఎస్ ను వదిలి వెళ్ళిపోయారు.
ప్రధానమైన మద్దతుదారుల్లో మరికొందరు తలసానిపై మండిపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళల్లో ఎవరికీ ఎలాంటి పదవులు దక్కకుండా మంత్రే అడ్డుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. పైగా కేసీయార్ పై పెరిగిపోతున్న వ్యతిరేకత కూడా ఎక్కువగానే ఉందట. అనేక కారణాల వల్ల మంత్రికి హ్యాట్రిక్ విజయం డౌటే అంటున్నారు. పార్టీలో కూడా కుమ్ములాటలు బాగా పెరిగిపోయాయట. అందుకనే పార్టీలో ఉంటే ఎదుగుదల ఉండదన్న ఆలోచనతో మరికొందరు పార్టీని వదిలేశారు.
2019 పార్లమెంటు ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా కొడుకును పోటీచేయిస్తే ఓడిపోయాడు. నియోజకవర్గవ్యాప్తంగా బీజేపీ చాపకిందనీరులా బలపడుతోంది. అలాగే కాంగ్రెస్ కూడా పుంజుకుంటోందని సమాచారం. అయితే ఇక్కడొక చిన్న లాజిక్ ఏమిటంటే రెండు ప్రధాన ప్రతిపక్షాలు ఎంతబలం పుంజుకుంటే అధికారపార్టీకి అంత లాభం. అంటే ప్రతిపక్షాల మధ్య ఓట్లు చీలిపోతే అధికారపార్టీ అభ్యర్ధి గెలుపుకు అంత అవకాశాలు పెరుగుతాయి. అయితే పార్టీతో పాటు అభ్యర్ధి మీదకూడా వ్యతిరేకతుంటే అప్పుడు ప్రతిపక్షాల్లో ఏదో ఒకదానికి ఓటర్లు గుండుగుత్తగా ఓట్లేసేస్తారు.
సికింద్రాబాద్ ఎంపీగా కిషన్ రెడ్డి గెలిచారు. ఈ గెలుపులో సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీకి మంచి మెజారిటి వచ్చింది. అంటే సనత్ నగర్ నియోజకవర్గంలో బీజేపీ బాగా పుంజుకుంటోందని అర్ధమవుతోంది. దీనికి మరో ఉదాహరణ ఏమిటంటే తర్వాత జరిగిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో నియోజకవర్గంలోని మోండామార్కెట్, రామ్ గోపాలపేట్, అమీర్ పేట్ డివిజన్లలో బీజేపీ కార్పొరేటర్లే గెలిచారు. జరుగుతున్నది చూస్తుంటే తలసాని హ్యాట్రిక్ కొట్టేది అనుమానంగానే తయారైంది. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.
This post was last modified on June 3, 2023 11:49 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…