Political News

కోడెల కుమారుడికి.. చంద్ర‌బాబు వ‌ర్త‌మానం..

ఉమ్మ‌డి గుంటూరు జిల్లాలోని స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి టికెట్‌ను ఆశించిన టీడీపీ యువ నాయ‌కుడు, డాక్ట‌ర్ కోడెల శివ‌రామ‌కృష్ణ‌(ఈయ‌న మాజీ స్పీక‌ర్ దివంగ‌త కోడెల శివ‌ప్ర‌సాద్ త‌న‌యుడు)ను చంద్ర‌బాబు బుజ్జ‌గిస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ నుంచి పోటీ చేయాల‌ని శివ‌రామ‌కృష్ణ నిర్ణ‌యించుకున్నారు. అయితే.. అనూహ్యంగా ఆయ‌న‌ను త‌ప్పిస్తూ..చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. ఈయ‌న స్థానంలో మాజీ మంత్రి, ఇటీవ‌ల పార్టీలోకి వ‌చ్చిన క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌కు టికెట్ దాదాపు ఖ‌రారైంది. దీంతో కోడెల శివ‌రామ‌కృష్ణ.. పార్టీపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో టీడీపీ అదినేత చంద్ర‌బాబు కోడెల‌ను బుజ్జ‌గించే చ‌ర్య‌లు ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో సత్తెనపల్లిలో కోడెల శివరాంతో టీడీపీ త్రిసభ్య బృందం చర్చలు జరిపింది. కన్నా లక్ష్మీనారాయణకు నియోజకవర్గ ఇంచార్జి ఇవ్వటంపై కోడెల శివరాం అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం అనంతరం మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, గుంటూరు టీడీపీ జిల్లా అధ్య‌క్షుడు , మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మీడియాతో మాట్లాడుతూ.. కోడెల కుటుంబానికి న్యాయం చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారని తెలిపారు.

సామాజిక సమీకరణల దృష్ట్యా కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి నియోజకవర్గ పార్టీ ఇన్చార్జిగా నియమించారని స్పష్టం చేశారు. శివరాంతో పాటు కోడెల అభిమానులకు కొంత బాధ ఉంటుందని… దాన్ని తీర్చేందుకు పార్టీ చర్యలు తీసుకుంటుందని తెలిపారు. కోడెల శివరాంను చంద్రబాబు త్వరలో పిలిపించుకుని మాట్లాడతారని జీవీ ఆంజనేయులు చెప్పారు. పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పని చేయాలని సూచించారు. శివరాంతో మాట్లాడి వెళ్లబోతున్న త్రిసభ్య బృందాన్ని శివరాం అనుచరులు కాసేపు అడ్డుకున్నారు. కార్ల ముందు బైఠాయించి.. శివరాంని అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. నిరసన తెలియజేస్తున్న శివరాం అనుచరులకు నచ్చజెప్పి నేతలు వెళ్లిపోయారు.

టీడీపీ సత్తెనపల్లి నియోజకవర్గం ఇన్చార్జిగా కన్నా లక్ష్మీ నారాయణను పార్టీ అధిష్టానం నియమించింది. ఇక్కడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని, సమీకరణాలను పోల్చుకుని, సత్తెనపల్లిలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యాన చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. కోడెల శివ ప్రసాద్ తనయుడు శివరాం, పార్టీ నేతలు, కార్యకర్తలు, శివరాం అనుయాయులు ఈ నిర్ణ‌యంపై నిప్పులు చెరుగుతున్నారు. అయితే.. చంద్ర‌బాబు వ‌ర్త‌మానం ప్ర‌కారం.. “శివరాంకి కచ్చితంగా భవిష్యత్ ఉంటుంది. శివ ప్రసాద్ కి మంచి అవకాశాలు ఉంటాయి. అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ అభ్యర్థి, పార్టీ బలోపేతానికి శివరాం కృషి చేయాలి” అని పేర్కొన్నారు.

This post was last modified on June 2, 2023 11:01 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వివేకా కేసులో స్పీడు పెంచిన సునీత

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…

2 hours ago

గౌతంరెడ్డికి ఈ సారి మూడిన‌ట్టేనా?

పూనూరు గౌతం రెడ్డి. విజ‌యవాడ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు. అయితే.. గ‌తంలో ఆయ‌న వంగ‌వీటి మోహ‌న్‌రంగాపై చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో…

5 hours ago

‘కంగువ’ శబ్ద కాలుష్యం.. టెక్నీషియన్ ఆవేదన

సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…

6 hours ago

కూట‌మి నేత‌లు కూడా ఒళ్లు ద‌గ్గ‌ర పెట్టుకోవాలి: చంద్ర‌బాబు వార్నింగ్‌

అసెంబ్లీ వేదిక‌గా కూట‌మి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏల‌కు, పార్టీల కార్య‌కర్త‌ల‌కు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…

6 hours ago

బాబు మ్యాజిక్ మ‌హారాష్ట్ర లో పని చేస్తదా?

టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు నేటి నుంచి మ‌హారాష్ట్ర‌లో రెండు పాటు ప‌ర్య‌టించ‌నున్నారు. ఆయ‌నతోపాటు డిప్యూటీ సీఎం ప‌వ‌న్…

7 hours ago