Political News

క‌దల‌నున్న ‘వారాహి’.. ప‌వ‌న్ ప్లాన్ ఇదే

ఏపీ రాజ‌కీయాలు మ‌రింత వేడెక్క‌నున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తామ‌ని.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు చీల‌కుండా చూస్తామ‌ని ప‌దే ప‌దే చెబుతున్న‌ జనసేన అధినేత పవన్కల్యాణ్  వారాహి యాత్రకు ముహూర్తం సిద్ధం చేసుకున్నారు. జూన్ రెండో వారం నుంచి వారాహిని లైన్‌లో పెట్టనున్నారు. రెండో వారం నుంచి తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ వారాహి వాహ‌నంలో పర్యటించనున్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.

ఆయా జిల్లాల్లోని ప్రధాన కూడళ్లు, ఖాళీ స్థలాల్లో ఏర్పాటు చేసే సభల్లో పవన్ ప్రసంగిస్తారు. ఈ నెల 14 నుంచి పవన్ యాత్ర ప్రారంభిస్తారని జనసేన నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అన్నవరం దర్శనం తర్వాత పత్తిపాడు నుంచి యాత్ర మొదల వుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన కల్పించేలా యాత్ర కొనసాగుతుందని చెప్పారు. స్థానికుల నుంచి సమస్యలపై పవన్ అర్జీలు తీసుకుంటారని, సమస్యల పరిష్కారం కోసం స్థానికంగా ఆయన పర్యటిస్తారని పేర్కొన్నారు.

తూర్పుపైనే ప్ర‌త్యేక దృష్టి

తూర్పుగోదావరి జిల్లాపై ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా దృష్టి పెట్ట‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ జిల్లాలోని మొత్తం 10 నియోజకవర్గాల్లో పవన్‌ పర్యటిస్తారని నాదెండ్ల చెప్పారు. సినిమాల పరంగా ఇచ్చిన కమిట్‌మెంట్లు పూర్తి అయితే.. ప్రజల్లోనే పవన్ ఉంటారని  పేర్కొన్నా రు. పవన్‌ సభలు, రోడ్‌ షోలకు వెళ్లినప్పుడు విద్యుత్‌ సరఫరా నిలిపివేస్తున్న ఉదంతాలు ఎదురవుతుండడంతో వారాహి వాహనంపైనా.. చుట్టుపక్కలా ప్రత్యేక లైటింగ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేసినట్లు జనసేన నేతలు తెలిపారు.

ఇక, వేలమందికి స్పష్టంగా వినిపించేలా అధునాతనమైన సౌండ్‌ సిస్టమ్‌ను వాహనంలో అంతర్భాగంగా ఉంటుంది. అలాగే, భద్రతా కారణాలరీత్యా వాహనానికి నలువైపులా సీసీటీవీ కెమెరాలు పెట్టి దాని ఫుటేజ్‌ ప్రత్యేక సర్వర్‌కు రియల్‌ టైంలో చేరేలా ఏర్పాటు చేశారు. ఇక, వాహనం లోపల పవన్‌తో పాటు మరో ఇద్దరు కూర్చునే వెసులుబాటు, వాహనం లోపలి నుంచి పైకి వెళ్లడానికి హైడ్రాలిక్‌ మెట్లు ఉంటాయి. ఈ వాహనానికి వారాహి అమ్మవారి పేరుపెట్టారు. వారాహి అన్ని దిక్కులను కాచే అమ్మవారిగా పురాణాలు చెబుతున్నాయి.  

This post was last modified on June 2, 2023 10:55 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago