టీడీపీ అధినేత చంద్రబాబు క్షణం తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఇప్పటికే మినీ మేనిఫెస్టో ప్రకటించిన ఆయన వచ్చే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా మరో అదిరిపోయే కాన్సెప్టుతో ప్రజల్లోకి రావాలని నిర్ణయించారు. ఈ నెల 10వ తేదీన చంద్రబాబు ఈకార్యక్రమాన్ని ప్రారంభించనున్నా రు. అనంతరం సుమారు 150 రోజుల పాటు ఆ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నిర్వహించనున్నారు.
సమావేశంలో భాగంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? ఏయే రోజున ఏయే కార్యక్రమాలు నిర్వహించాలి..? వంటి అంశాలపై ఇప్పటికే రోడ్ మ్యాప్‌రెడీ చేసుకున్నారు. అయితే.. ఈ 150 రోజుల కార్యక్రమానికి `భవిష్యత్తుకు గ్యారెంటీ` పేరు పెట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు. పార్టీ నాయకులతో కలిసి.. వారి చర్చించనున్నారు. అనంతరం.. ఈ పేరును ఖరారు చేయనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. జూన్ 10న ప్రారంభమయ్యే ‘భవిష్యత్‌కు గ్యారెంటీస కార్యక్రమాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లనున్నారు.
ఇప్పటికే ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో టీడీపీ ఎన్నికల మేనిఫెస్టో.. విడుదల చేసింది. ఈ నేపథ్యంలో ఆ పేరుతోనే (‘భవిష్యత్తుకు గ్యారెంటీ’) ఈ నెల 10వ తేదీ నుంచి ప్రజల్లోకి చంద్రబాబు, ఆ పార్టీ నేతలు వెళ్లనున్నారు. గతకొన్ని నెలలక్రితం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘బాదుడే బాదుడు, ఇదేం కర్మ మన రాష్ట్రానికి’ కార్యక్రమాలు విజయం సాధించాయి. వైసీపీ ప్రభుత్వంపై ఓ రేంజ్‌లో ప్రజలు ఆలోచించేలా చేయగలిగారు. ప్రభుత్వ దమన నీతిని ఎండగట్టారు.
ఈ నేపథ్యంలో ‘భవిష్యత్తుకు గ్యారెంటీ’ పేరుతో త్వరలోనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టి.. మరింతగా ప్రభుత్వ అవినీతి, అభివృద్ధి లేకపోవడం.. వంటి విషయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. దీనిలో అందరూ పాల్గొనేలా.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండేలా కార్యక్రమాన్ని తీర్చి దిద్దారు.
This post was last modified on June 2, 2023 1:37 pm
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…
దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…