ప్రస్తుతం ఎంఎల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత రాబోయే ఎన్నికల్లో మళ్ళీ పార్లమెంటుకు పోటీచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే తరచూ కవిత నిజామాబాద్ లోక్ సభ పరిధిలో ఎక్కువగా పర్యటిస్తున్నారు. ఈ కారణంగానే పార్లమెంటుకు కవిత మళ్ళీ పోటీచేయబోతున్నారనే చర్చ పార్టీతో పాటు నియోజకవర్గంలో పెరిగిపోతోంది. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కవిత మళ్ళీ ఇటువైపు తిరిగి కూడా చూడలేదు. పార్టీపరంగా ఏదైనా కార్యక్రమం లేకపోతే నేతల ఇళ్ళల్లో జరిగే కార్యక్రమాలకు హాజరవ్వటం తప్ప మాజీ ఎంపీ హోదాలో జిల్లాలో పర్యటించటం మానుకున్నారు
ఆ తర్వాత జిల్లా నుండి స్ధానికసంస్ధల కోటాలో ఎంఎల్సీగా గెలిచినా కూడా జిల్లాలో యాక్టివ్ గా కనబడలేదు. అలాంటిది చాలాకాలం తర్వాత ఈమధ్యనే యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ ప్రజాప్రతినిధులతో సమావేశాలు పెడుతున్నారు. అలాగే నియోజకవర్గంలో ఉన్న కులసంఘాల నేతలతో కూడా తరచు భేటీ అవుతున్నారు. ఇదంతా చూసిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో మళ్ళీ నిజామాబాద్ లో బరిలోకి దిగటం ఖాయమనే ప్రచారం బాగా పెరిగిపోతోంది.
ఇక్కడ కవితకు ఒక సమస్యుంది. అదేమిటంటే 2014లో ఎంపీగా గెలిచినపుడు నియోజకవర్గం అభివృద్ధికి ఇచ్చిన హామీలు చాలావరకు నెరవేరలేదు. కవిత అంటే మామూలు ఎంపీకాదు ముఖ్యమంత్రి కూతురన్న విషయం అందరికీ తెలుసు. కాబట్టే కవిత హామీలిచ్చారంటే కచ్చితంగా నెరవేరుస్తారనే అనుకున్నారు. అయితే దానికి భిన్నంగా వ్యవహరించారు. ఇదే సమయంలో రైతులు, రైతుసంఘాలతో బాగా గొడవలుపెట్టుకున్నారు.
దాంతో 2019 ఎన్నికల్లో అందరు కలిసి కవితను ఓడించారు. ఆ మంటుంది కాబట్టే తర్వాత నియోజకవర్గంలోకి తొంగికూడా చూడలేదు. అయితే తర్వాత ఎంఎల్సీ అయినా ఆమె పద్దతిలో ఎలాంటి మార్పరాలేదు. నియోజకవర్గం అభివృద్ధిపైన పెద్దగా దృష్టిపెట్టకుండా ఎంతసేపు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్విందును టార్గెట్ చేయటంతోనే సరిపోతోంది. ఈమధ్య తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఇరుక్కోబట్టి మిగిలిన విషయాలను కూడా వదిలేశారు. మరీ నేపధ్యంలోనే కవిత రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేస్తే గెలుస్తారా ? అన్నది ఆసక్తిగా మారింది.
This post was last modified on June 2, 2023 1:07 pm
అభిమానులు భయపడినట్టే జరిగేలా ఉంది. మే 9 హరిహర వీరమల్లు వస్తుందని గంపెడాశలతో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి షాక్…
థియేటర్లలో జనాలు లేక అలో లక్ష్మణా అంటూ అల్లాడిపోతున్న బయ్యర్లకు ఊరట కలిగించేందుకు ఈ వారం రెండు చెప్పుకోదగ్గ సినిమాలు…
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…