కోర్టును తప్పుదోవ పట్టించిన కడప ఎంపీ అవినాష్ లాయర్ పై చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత తరపు లాయర్ మెమో దాఖలుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వివేకానందరెడ్డి మర్డర్ కేసులో అవినాష్ కీలక సూత్రదారని సీబీఐ వాదిస్తోంది. కాబట్టి ఎంపీకి బెయిల్ ఇవ్వద్దని పదేపదే కోర్టులో చెప్పింది. అయితే వివేకా మర్డర్ కేసులో ఎంపీ పాత్రకు సంబంధించిన ఆధారాలను సీబీఐ చూపలేకపోయింది.
ఇదే సమయంలో అవినాష్ తల్లికి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ఆపరేషన్ జరగాల్సుంది కాబట్టి అవినాష్ కు బెయిల్ ఇవ్వాలని లాయర్ వాదించారు. అయితే దీన్ని సీబీఐ లాయర్ వ్యతిరేకించారు. అవినాష్ తల్లికి ఆపరేషన్ అవసరమే లేదని, గుండెలో రెండు కవాటాలు పూడుకుపోవటం, స్టంట్లు వేయాలని చెప్పటం నమ్మేట్లుగా లేదన్నారు. అయితే అందుబాటులోని మెడికల్ రికార్డులను పరిశీలించిన జడ్జి ఆపరేషన్ జరగబోతున్నట్లు నమ్మి ఎంపీకి తాత్కాలిక బెయిలిచ్చారు. ఒకవేళ ఆపరేషన్ అన్నది తప్పని తేలితే అవినాష్ లాయర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఇపుడా విషయంమీదే సునీత లాయర్ కోర్టులో మెమో దాఖలుచేశారు. ఎంపీ తల్లికి ఎలాంటి ఆపరేషన్ జరగలేదన్నారు. కోర్టును తప్పుదోవ పట్టించారు కాబట్టి అవినాష్ లాయర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అవినాష్ లాయర్ వాదన వేరేరకంగా ఉంది. ఆపరేషన్ చేయాల్సిందయితే వాస్తవమే అంటున్నారు. ఇంకా ఆపరేషన్ జరగకపోవటానికి కారణం పేషంట్ బీపీ, షుగర్ కంట్రల్లో ఉండకపోవటమే అని చెప్పారు.
బీపీ, షుగర్ గనుక ఎప్పుడు కంట్రోల్ అయితే అప్పుడు వెంటనే ఆపరేషన్ మొదలవుతుందన్నారు. పేషంట్ గుండెలో రెండు రక్తనాళాలు పూడుకుపోవటంలో వెంటనే స్టంట్ వేయాల్సిన అవసరముందని కర్నూలు ఆసుపత్రులో వైద్యులు నిర్ధారించినట్లు లాయర్ చెప్పారు. అందుకు అవసరమైన రికార్డులన్నింటినీ ఇదివరకే అందించారు. మరి సునీత లాయర్ దాఖలుచేసిన మెమో మీద కోర్టు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సిందే.
This post was last modified on June 1, 2023 6:31 pm
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్‌తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…