ఎల్లుండి విడుదల కాబోతున్న దగ్గుబాటి అభిరాం డెబ్యూ అహింసకు అంతా రెడీగా ఉంది. సామాన్య ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు లేవు కానీ రెగ్యులర్ మూవీ లవర్స్ మాత్రం దర్శకుడు తేజ ఏదైనా మేజిక్ చేయకపోతారాని ఎదురు చూస్తున్నారు. అయితే ప్రమోషన్ల కోసం విస్తృతంగా మీడియాకు అందుబాటులో ఉన్న తేజ సినిమాలో కంటెంట్ కంటే తన కౌంటర్లతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. ఇటీవలి కాలంలో కాస్త వివాదాస్పద ప్రశ్నలకు హైలైట్ అవుతున్న ఓ జర్నలిస్ట్ ని ప్రెస్ మీట్ అయ్యాక బయట ఓ ప్రైవేట్ ఇంటర్వ్యూ చేయడం ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు.
గతంలో నిర్మాత కూడా అయిన సదరు మీడియా ప్రతినిధిని ఇప్పుడు సినిమాలు ఎందుకు తీయడం లేదని నేరుగా అడిగేశారు. క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ టైంలోనూ నేపధ్య సంగీతం అందించిన అనూప్ రూబెన్ పేరు ఎందుకు లేదన్న ప్రశ్నకు ఆర్పి పట్నాయక్ తో పాటు ఇద్దరినీ పరిచయం చేసింది నేనే కాబట్టి నా ఇష్టం అంటూ ఇచ్చిన కౌంటర్ మాములుగా వెళ్లడం లేదు. ఇదొక్కటే కాదు మరో లేడీ యాంకర్ ముఖాముఖీ కార్యక్రమంలో ఆవిడ కాస్త ముఖస్తుతికి వెళ్ళబోతే నా సినిమాల్లో ఇన్ని గొప్ప విషయాలు ఉన్నాయని మీరు చెప్పాకే తెలిసిందని అనడం మరో కొసమెరుపు
మొత్తానికి ఏదైతేనేం తేజ వార్తల్లో నిలుస్తున్నారు. అభిరాంకి ఎలాంటి ఎంట్రీ దక్కుతుందోనని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రత్యేకంగా ఫాలోయర్స్ లేరు కానీ వెంకటేష్, రానా అభిమానులే సపోర్ట్ గా నిలవాలి. ట్రైలర్ అమాంతం అంచనాలు పెంచలేకపోయినా బాక్సాఫీస్ వద్ద నేను స్టూడెంట్ సర్ తప్ప పెద్దగా పోటీలేని అవకాశాన్ని అహింస ఎలా వాడుకుంటుందో చూడాలి. సురేష్ సంస్థ నిర్మాణం కం డిస్ట్రిబ్యూషన్ కాబట్టి థియేటర్ల పరంగా ఎలాంటి సమస్య లేదు. ఎటొచ్చి వీక్ గా మొదలయ్యే ఓపెనింగ్ ని పికప్ చేసుకోవాల్సిన బాధ్యత అభిరాం కన్నా ఎక్కువ తేజ మీద ఉంది
This post was last modified on June 1, 2023 12:19 am
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సమావేశం ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల్లోని పాలకులు, వ్యాపారవర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్న సంగతి…
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై జరుగుతున్న విచారణలో రాష్ట్ర జలవనరుల అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వి.ప్రకాశ్ కీలక సమాచారాన్ని…