మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండకపోతే మంటలు మండటం ఖాయం. ఇప్పుడు బీజేపీ నేత ఈటల రాజేందర్ వ్యవహారం అలాగే తయారైంది. ఓ మాదిరి నేలతంతా ఇపుడు ఈటల వ్యవహారశైలిపై మండిపోతున్నారు. మీడియాతో మాట్లాడుతు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు బీజేపీలో చేరకపోవచ్చని చెప్పారు. కారణం ఏమిటంటే వాళ్ళిద్దరికీ బీజేపీలో చేరటానికి ఏవో ఇబ్బందులు ఉన్నట్లుగా ఈటల అనుమానం వ్యక్తంచేశారు. ఇంతటితో ఊరుకోకుండా వీళ్ళిద్దరు కాంగ్రెస్ లో చేరవచ్చని కూడా చెప్పారు.
ఇక్కడే ఈటల మాటలపై మంటలు మొదలయ్యాయి. ఎందుకంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జూపల్లి బాగా సీనియర్ నేత. ఇదే సమయంలో ఖమ్మంకు చెందిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలా బలమైన నేత. పొంగులేటికి ఆర్ధిక, అంగబలం చాలా ఎక్కువ. పొంగులేటి ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ నిధులకోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల్లో అవసరమైతే ఎంత డబ్బయినా ఖర్చుచేయటానికి వెనకాడరు.
ఇలాంటి పొంగులేటిని దూరం చేసుకుని కేసీయార్ తప్పుచేశారనే ప్రచారం బలంగా జరుగుతోంది. అందుకనే మాజీఎంపీని తమపార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ విషయం ఏమిటంటే పొంగులేటి, జూపల్లితో మాట్లాడింది ఈటలే. ఎందుకంటే బీజేపీలో చేరికల కమిటికి ఛైర్మన్ ఈటలే అన్నవిషయం తెలిసిందే. కమిటి ఛైర్మన్ పై ఇద్దరు నేతలు బీజేపీలో చేరరని చెప్పి కాంగ్రెస్ లో చేరే అవకాశాలున్నాయని చెప్పటం ఏమిటి ?
ఈటల బాధ్యత ఇతరపార్టీల్లోని నేతలను బీజేపీలో చేరేట్లుగా ఒప్పించటమే. ఇతర నేతలను పార్టీలోకి రప్పించేందుకు ఈటల తనవంతు ప్రయత్నాలను తానుచేయాలి. చేరటం చేరకపోవటం ఆ నేతలిష్టం. ఇపుడు పొంగులేటి, జూపల్లి బీజేపీలో చేరకపోయినా పర్వాలేదు. కాంగ్రెస్ లో చేరితే బీజేపీ నేతలు ఎవరూ చేయగలిగేది కూడా ఏమీలేదు. కానీ ఆ నేతలిద్దరు బీజేపీలో చేరరని, కాంగ్రెస్ లో చేరుతారని ఈటలే స్వయంగా చెప్పటం ఏమిటో అర్ధంకావటంలేదు. పైగా ఖమ్మం జిల్లాలో బీజేపీ బలహీనంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ మాటల మీదే ఈటల చుట్టూ మంటలు మండుతున్నాయి.
This post was last modified on May 31, 2023 1:32 pm
రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యర్థులతో వైరం ఎలా ఉన్నా.. ప్రజలతో మాత్రం పార్టీలకు సాన్నిహిత్యం ఉండాలి. అది కొరవడితే.. ఎప్పటికీ చేరువ…
నేచురల్ స్టార్ నాని కెరీర్లో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒకటి. ట్యాక్సీవాలాతో దర్శకుడిగా పరిచయం అయిన రాహుల్…
పెద్ద బడ్జెట్ పెట్టి, చాలా కాలం కష్టపడి, ఎన్నో ఆశలతో చేసిన సినిమాకు నెగెటివ్ టాక్ వస్తే తట్టుకోవడం తేలిక…
ఏపీ సీఎం చంద్రబాబు రాజధాని అమరావతి విషయంలో అత్యంత శ్రద్ధ చూపిస్తున్న విషయం తెలిసిందే. రైతుల నుంచి భూములు సమీకరించడం(పూలింగ్)…
ఈ ప్రశ్నకు సమాధానం కోసం ఎక్కువ ఆలోచించాల్సింది ఏముంది? రచయితగా తన తొలి సినిమా స్వయంవరం కాబట్టి.. ఆ సినిమాకే…
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు వల్లభనేని వంశీ రాజకీయాల్లో దూకుడు పెంచారు. ప్రస్తుతం పార్టీని బలోపేతం చేసే దిశగా…