ఢిల్లీ లిక్కర్ స్కామ్లో పాత్రపై కల్వకుంట్ల కవితను ఈడీ ఆడుకుంటున్నట్లే ఉంది. ఒకసారి కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లో కవిత పేరు మాయమైపోతుంది. మొత్తం చార్జిషీట్లో కవిత పేరు ఎక్కడా కనబడదు. దాంతో చార్జిషీట్లో నుండి పేరును ఈడీ తీసేసింది కాబట్టి కవితకు పెద్ద రిలీఫ్ దొరికినట్లే అని బీఆర్ఎస్ నేతలు సంబరాలు చేసుకుంటారు. అంతకుముందు వరుసగా మూడురోజులు విచారణకు రమ్మని కవితపై ఈడీ బాగా ఒత్తిడితెచ్చింది. విచారణలో ముప్పుతిప్పులు పెట్టింది.
తాజాగా అంటే మంగళవారం కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో కవితపేరును ఈడీ 53 సార్లు ప్రస్తావించింది. 278 పేజీల చార్జిషీట్లో అరుణ్ పిళ్ళై, సమీర్ మహేంద్రు స్టేట్మెంట్లున్నాయి. వీళ్ళిద్దరి స్టేట్మెంట్లలో చాలాచోట్ల కవిత ప్రస్తావనను ఈడీ తెచ్చింది. సౌత్ గ్రూపులో కవిత తరపున తానే ప్రతినిధిగా వ్యవహరించినట్లు అరుణ్ పిళ్ళై అంగీకరించినట్లు ఈడీ చార్జిషీట్లో స్పష్టంగా చెప్పింది. లిక్కర్ పాలసీని తయారుచేసేముందే కవితతో ఆప్ తరపున విజయ నాయర్ చాలాసార్లు మాట్లాడినట్లు ఈడీ ఆధారాలతో సహా చెప్పింది.
లిక్కర్ పాలసీ విషయంలోనే కాకుండా తర్వాత జరుగుతున్న బిజినెస్ విషయంపైన కూడా కవిత-సమీర్ మహేంద్రు చాలాసార్లు ఫేస్ టైంలో మాట్లాడుకున్నారనే ఆధారాలను చార్జిషీట్లో చెప్పింది. ఇదే విషయంపైన హైదరాబాద్ లో జరిగిన సమావేశంలో కవిత భర్త అనీల్ కూడా పాల్గొన్నారని కొన్ని ఆధారాలను కూడా ఈడీ కోర్టుముందుంచుంది. దాంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో తనతో పాటు కవిత తన భర్త అనీల్ ను కూడా తగిలించినట్లయ్యింది.
మొత్తానికి ఒక చార్జిషీట్లో కవిత పేరు ప్రస్తావిస్తున్న ఈడీ మరో చార్జిషీట్లో కవిత పేరును ఎందుకు ప్రస్తావించటంలేదో అర్ధంకావటంలేదు. నిజానికి కవితను ఈడీ అరెస్టుచేయటం ఖాయమని విచారణ సందర్భంగానే బాగా ప్రచారం జరిగింది. కవిత అరెస్టు ఖాయమని స్వయంగా కేసీయార్ ప్రకటించారు. దాంతో ఈడీ విచారణ అన్నప్పుడల్లా బీఆర్ఎస్ నేతలు భారీఎత్తున ఢిల్లీకి చేరుకునే వాళ్ళు. అప్పట్లో అరెస్టని అంత ప్రచారం జరిగినా ఎందుకనో అరెస్టుచేయలేదు. అలాంటిది ఇపుడు మళ్ళీ చార్జిషీట్లో కవిత ప్రస్తావన తెచ్చింది. మరీసారి ఏమవుతుందో చూడాల్సిందే.
This post was last modified on May 31, 2023 11:02 am
2024 సార్వత్రిక ఎన్నికల ముందు ఏపీలో కూటమి పార్టీలకు చెందిన శ్రేణుల నుంచి ఓ వినూత్న నినాదం వినిపించింది. సైకో…
బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న హిట్ 3 ది థర్డ్ కేస్ మీద జరిగిన రివ్యూలు, ఆన్ లైన్ విశ్లేషణలు, సోషల్…
మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కబోయే ఎంటర్ టైనర్ కోసం హీరోయిన్ వేట కొనసాగుతోంది. ఏవేవో పేర్లు అనుకుని…
"తెలంగాణ పోలీసులు ట్రాఫిక్ విషయంలో కఠినంగా ఉంటారు. ఖచ్చితంగా ఉంటారు."- ఇదీ.. కొన్నిరోజుల కిందట పోలీసు బాస్ చేసిన కామెంట్లు.…
ఎదురు చూసి చూసి అభిమానులే అంచనాలు తగ్గించేసుకున్న హరిహర వీరమల్లు గేరు మార్చబోతోందని తాజా సమాచారం. ఈ రోజు నుంచి…
నిన్న జరిగిన లార్వెన్ ఏఐ స్టూడియో ప్రారంభోత్సవంలో దర్శకులను ఉద్దేశించి నిర్మాత దిల్ రాజు అన్న మాటలు ఆలోచింపజేసేలా ఉన్నాయి.…