Political News

పార్టీలోకి రమ్మని అడిగితే.. తమతో రమ్మన్నారట

రాజకీయ లెక్కలు మారుతున్నాయి. గతానికి భిన్నమైన రాజకీయం ఇప్పుడు కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. ఏ పార్టీలో చేరాలన్న దానిపై నిర్ణయం తీసుకోకుండా.. విపక్షాల్ని ఊరిస్తున్న పొంగులేటి.. జూపల్లిల ఉదంతంలో కొత్త సీన్ ఒకటి బయటకు వచ్చింది. ఈ ఇద్దరు నేతల్ని తమ పార్టీలోకి తీసుకుంటే మరింత బలోపేతం అవుతాయన్న ఆలోచనలో ఉన్నాయి బీజేపీ.. కాంగ్రెస్ పార్టీలు. అందుకు తగ్గట్లే పెద్ద ఎత్తున ప్రయత్నాలు సాగుతున్నాయి.

బీఆర్ఎస్ నుంచి వేటు పడిన అనంతరం.. గులాబీ తోట నుంచి బయటకు వచ్చేసిన ఈ ఇద్దరు నేతల్ని ఒడుపుగా పట్టుకొని తమ కండువాలు వేసేందుకు కాంగ్రెస్..కమలం పార్టీలు ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా ప్రయత్నాలు చేయటం తెలిసిందే. ఇలాంటి క్రమంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి బీజేపీ నేతల ఈటల రాజేందర్ నోటి నుంచి వచ్చిన మాటలు ఆసక్తికరంగా మారాయి. తమ పార్టీలోకి రావాలని కోరిన జూపల్లి.. పొంగులేటి తనకే రివర్సు కౌన్సెలింగ్ ఇస్తున్నారంటూ ఈటల వ్యాఖ్యానించటం తెలిసిందే.

బీజేపీ చేరికల కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్ వారితో పలుమార్లు భేటీ కావటం.. గంటల కొద్దీ చర్చలు జరపటం తెలిసిందే. బీజేపీలో వారు చేరేందుకు తాను చేయగిలినంత చేసిన ఈటలకు ఈ ఇద్దరు నేతలు చివర్లో షాకిచ్చారు. ఇద్దరునేతల్ని బీజేపీలో చేరేలా ఒప్పించేందుకు తన వంతు ప్రయత్నాలు తాను చేశానని.. కానీ, వారు బీజేపీలో చేరతానని చెప్పకపోగా.. తనకే రివర్సు కౌన్సెలింగ్ ఇస్తున్నట్లుగా ఈటెల వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే తాజాగా జూపల్లి క్రిష్ణారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తాము బీజేపీలోకి వెళ్లటం కాదని.. ఈటలనే తమతో పాటు రావాలని కోరినట్లుగా చెప్పటం గమనార్హం. కేసీఆర్ ను గద్దె దించటమే లక్ష్యమని.. వచ్చే నెలలో తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని చెప్పిన ఆయన.. తమతో పాటు అందరూ కలిసి రావాలని కోరతున్నట్లు చెప్పారు. మారిన రాజకీయాలకు తాజా ఉదంతం ఒక కొత్త ఉదాహరణగా చెప్పాలి. పార్టీలో రావాలని కోరిన వారికే.. రివర్సుగేరులో ఆఫర్లు ఇస్తున్న నేతల తీరు తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది.

This post was last modified on May 31, 2023 8:16 am

Share
Show comments
Published by
Tharun

Recent Posts

భారీ వ‌ర్షంలోనూ చంద్ర‌బాబు ప్ర‌చారం!

గ‌న్న‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో చంద్ర‌బాబు తాజాగా ఎన్నిక‌ల ప్ర‌చారం చేశారు. అయితే.. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలోకి అడుగు పెట్టేస‌రికి.. భారీ ఎత్తున వ‌ర్షం…

3 mins ago

ప‌దునైన ఆయుధంతో బాబు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల వేళ కూట‌మికి ఓ ప్ర‌ధాన ఆయుధం దొరికింది. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఈ విష‌యాన్నే…

2 hours ago

మీడియా ముందే వ‌ల‌వ‌లా ఏడ్చేసిన ష‌ర్మిల..

మీడియా ముందే నాయ‌కులు వ‌ల‌వ‌లా ఏడ్చేయ‌డం కొత్త కాదు. గ‌తంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబు కూడా.. త‌న స‌తీమ‌ణిని దూషించారంటూ..…

2 hours ago

ప‌వ‌న్‌తో పొత్తుకు జ‌గ‌న్ ఆరాటం!

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల స‌మ‌రం హోరాహోరీగా సాగుతోంది. మే 13న జ‌రిగే పోలింగ్‌తో పార్టీల రాజ‌కీయ జీవితాలు ముడిప‌డి ఉన్నాయి. అధికారం…

3 hours ago

ఉద్యోగులు పోటెత్తారు.. క‌నీవినీ ఎరుగ‌ని పోలింగ్‌.. !

ఏపీలో ఉద్యోగులు గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా ఓటెత్తారు. మొత్తం ల‌క్ష‌ల సంఖ్య‌లో ఉన్న ఉద్యోగులు.. ఏకంగా 4.32 ల‌క్ష‌ల…

4 hours ago

తేజ – రానా ఏమిటీ మౌనం

ఒకప్పుడు చిత్రం, జయం లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన తేజ గత కొన్నేళ్లుగా పూర్తిగా అవుట్ అఫ్ ఫామ్ లో…

5 hours ago