Political News

విష్ణుకు టీడీపీ మొండిచేయి?

రాజకీయాల్లో పాపం కొందరు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఎన్ని రోజులు ఎదురుచూసినా వాళ్ల ఆశలు నెరవేరవు. చివరకు ఉన్న దాంట్లో సర్దుకుపోదాములే అనుకుని ఊరుకుంటారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ నాయకులు, విశాఖ నార్త్ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పరిస్థితి కూడా అంతే.

నిజానికి విష్ణు కుమార్ రాజు బీజేపీలో క్రియాశీల సభ్యుడు. పార్టీ లైన్లోనే ఉండేవారు. 2019లో ఓడిపోయిన తర్వాత ఏపీలో బీజేపీకి మనుగడ లేదని ఆయన అనిపించి ఉండొచ్చు. దానితో ఆయనకు పార్టీకు దూరం జరగాలన్న ఆలోచన వచ్చినట్లు చెబుతారు. టీడీపీకి దగ్గరైతే మళ్లీ విశాఖ నార్త్ సీటు దక్కుతుందని ఎమ్మెల్యే అయ్యే అవకాశం వస్తుందని కూడా ఎదురు చూశారు. ఆ దిశగా టీడీపీకి సంకేతాలు పంపారు.

విష్ణు కుమార్ రాజు కొన్ని మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇచ్చే క్రమంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఛ..ఛ.. విశాఖ రాజధాని మాకు వద్దే వద్దు అన్న మాటలను వైసీపీ బాగానే ఎక్స్ పోజ్ చేసింది. బీజేపీలోని ఒక వర్గం విష్ణుపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసింది. తొలుత విష్ణు వాటిని పట్టించుకోలేదు. సైకిలెక్కాలన్న ఆలోచనలో ఉన్నందున లెక్కచేయలేదు.

కట్ చేసి చూస్తే విష్ణును టీడీపీ అధినేత చంద్రబాబు పట్టించుకున్న దాఖలాలు కనిపించలేదు. అందుకు కారణాలు లేకపోలేదు. టీడీపీ ఇప్పటికే రద్దీ ఎక్కువైన పార్టీగా మారింది. అందులోనూ విశాఖలో కుటుంబాలకు కుటుంబాలే టీడీపీని దశాబ్దాలుగా నమ్ముకుని ఉన్నాయి. దానితో విష్ణుకు చంద్రబాబు ఎలాంటి హామీ ఇవ్వలేకపోయారు. ఇక చేసేదేమీ లేక ప్రస్తుతానికి బీజేపీలోనే ఉండిపోవాలని విష్ణు నిర్ణయించుకున్నారు. తనకు అధిష్టానం పంపిన షో కాజ్ నోటీసుకు మర్యాదగా సమాధానం రాశారు. అంతకంటే ఏం చేస్తారు మరి…

This post was last modified on May 30, 2023 6:04 pm

Share
Show comments
Published by
satya

Recent Posts

తెలుగులో స్టార్లతో హిందీలో కంటెంటుతో

కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…

55 mins ago

నారా రోహిత్ సినిమాకు ఇన్ని కష్టాలా

ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…

1 hour ago

జ‌గ‌న్‌లో ఓట‌మి భ‌యానికిది సంకేత‌మా?

ఆంధ్ర‌ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ఇంకో వార‌మే స‌మ‌యం ఉంది. ఈ ఎన్నిక‌లు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్‌కు, అటు ప్ర‌తిప‌క్ష…

8 hours ago

ఫ్యామిలీ మ్యాన్ ఫ్యాన్స్‌కు స్వీట్ న్యూస్

‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…

9 hours ago

ప‌థ‌కాల మాట ఎత్తొద్దు: జ‌గ‌న్‌కు ఈసీ షాక్‌!

ఏపీ ప్ర‌భుత్వానికి కేంద్ర ఎన్నిక‌ల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జ‌గ‌న్ ప్ర‌బుత్వం అమ‌లు చేస్తున్న ప‌థ‌కాల‌ను ఎన్నిక‌ల…

13 hours ago

మోడీని మెస్మరైజ్ చేసిన లోకేష్

రాజ‌మండ్రిలో నిర్వ‌హించిన కూటమి పార్టీల‌(జ‌న‌సేన‌-బీజేపీ-టీడీపీ) ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ 'ప్ర‌జాగ‌ళం'లో చంద్ర‌బాబు పాల్గొన లేక పోయారు. ఆయ‌న వేరే స‌భ‌లో…

16 hours ago