నరేంద్రమోడీ తప్పు చేస్తున్నారు. ప్రపంచంలో మన దేశ ఖ్యాతిని గొప్పగా చాటి చెబుతున్న మహిళా రెజ్లర్ల సమస్యలను పరిష్కరించటంలో మోడీ చాలా నిర్లక్ష్యం చూపుతున్నట్లు అర్ధమవుతోంది. ఆదివారం పార్లమెంట్ భవనం దగ్గరకు వెళ్ళాలని ప్రయత్నించిన మహిళా రెజ్లర్ల ను పోలీసులు అడ్డుకుని ఈడ్చుకుని తీసుకెళ్ళి బస్సుల్లో పడేశారు. బస్సుల్లో వాళ్ళందరినీ వేర్వేరు పోలీసుస్టేషన్లకు తీసుకెళ్ళారు. పోలీసుల చర్యలతో ఏమైందంటే మహిళా రెజ్లర్ల మీద జరుగుతున్న దాడులు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రముఖంగా టెలిక్యాస్టయ్యింది. దీనివల్ల పోయేది రెజ్లర్ల పరువు కాదు దేశం పరువన్న విషయాన్ని మోడీ గుర్తుంచుకోవాలి.
తమను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్న రెజ్లింగ్ ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని ఏప్రిల్ 23వ తేదీ నుంచి మహిళా రెజర్లంతా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్షలు చేస్తున్నారు. ఈ విషయం అంతర్జాతీయ మీడియాలో కూడా వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో దేశం తరఫున ప్రాతినిధ్యం వహిస్తు పతకాలు తెస్తున్న వీళ్ళకే ఇన్ని సమస్యలుంటే ఇక మామూలు మహిళల సంగతిని చెప్పాల్సిన అవసరమే లేదు. పైగా తనకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్ల చేస్తున్న దీక్షపై బ్రిజ్ భూషణ్ చాల ఎగతాళిగా మాట్లాడారు.
అంతర్జాతీయ క్రీడాకారులు దీక్షలు చేస్తుంటే కేంద్ర క్రీడాశాఖ మంత్రి ఏమిచేస్తున్నట్లు ? కేంద్ర హోంశాఖ మంత్రి ఏమి చేస్తాన్నారో అర్థం కావడం లేదు. దీక్షలు చేస్తున్న వాళ్ళంతా ఏ కాలేజీ అమ్మాయిలో లేకపోతే అనామకులో కాదు. అంతర్జాతీయంగా పేరున్న రెజర్లన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం మరచిపోయింది.
వీళ్ళు రోడ్డెకగానే వాళ్ళని పిలిచి మాట్లాడుంటే సమస్య ఇంత పెద్దదయ్యేది కాదు. విచిత్రం ఏమిటంటే ఇపుడు నరేంద్రమోడీ మంత్రివర్గంలో ఒలంపిక్స్ లో పాల్గొన్న అనురాగ్ ఠాకూర్ కూడా ఉన్నారు. తాను క్రీడాకారుడు అయ్యుండి కూడా సాటిక్రీడాకారులు అందులోను మహిళలు నెల రోజులకుపైగా దీక్షలు చేస్తుంటే పట్టించుకోకపోవటం ఆశ్చర్యంగా ఉంది. పైగా అంతర్జాతీయంగా మెడల్స్ తెచ్చిన క్రీడాకారులతో నరేంద్రమోడీ రెగ్యులర్ గా ఫొటోలు దిగుతారు. మరి తాము వేధింపులకు గురవుతున్నామని రోడ్డెక్కిన రెజ్లర్ల సమస్యలను తీర్చాల్సిన బాధ్యత మోడీకి లేదా ?
This post was last modified on May 29, 2023 11:38 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…