అంగరంగ వైభవంగా రెండు రోజుల పాటు నిర్వహించిన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు అనేక విషయాలను ప్రస్తావించారు. వైసీపీ పాలనపై విమర్శలు గుప్పించారు. వైసీపీ నేతల దూకుడును ప్రస్తావిం చారు. రౌడీ రాజకీయం అంటూ.. విమర్శలు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో జరుగుతున్న దోపిడీని కూడా చంద్రబాబు ప్రస్తావించారు. అయితే.. ఇంత వరకుబాగానే ఉంది. కానీ, పార్టీ నాయకులు..సీనియర్ నేతలు ఆశగా ఎదురు చూసిన మూడు విషయాలను మాత్రం చంద్రబాబు మిస్ చేశారనే వాదన వినిపిస్తోంది.
1) వారసుల విషయం: పార్టీ నుంచి ఈ సారికూడా భారీ సంఖ్యలో వారసులు పోటీ చేసేందుకు రెడీగా ఉన్నారు. వీరిలో ఇప్పటికే కొందరు తమకు టికెట్ ఇవ్వాల్సిందేనని పట్టుబడుతున్నారు. అయితే.. గత ఎన్నికల్లో అంటే.. 2019లో వారసులకు చాలా మందికి టికెట్‌లు చంద్రబాబు చేతులు కాల్చుకున్నారనే వాదన వినిపించింది. దీంతో ఈసారివారసులకు ఇస్తారా? ఇవ్వరా? అనే చర్చ సాగింది. దీనిపై మహానాడులో ఏదో ఒకటి తేల్చేస్తారని అందరూ అనుకున్నారు.కానీ..చంద్రబాబు మౌనం వహించారు.
2) అంతర్గత కుమ్ములాటలు: టీడీపీ చాలా బాగుందని పైకి చెబుతున్నప్పటికీ.. పార్టీలో అంతర్గత కుమ్ము లాటలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. ఈ పరిణామాలతోనే కొందరు నాయకులు తాజాగా నిర్వహించిన మహానాడుకు హాజరు కాలేదు. ఇక, వచ్చే ఎన్నికల నాటికి ఈ పరిస్థితిని అదుపు చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే.. ఈ విషయాన్ని కూడా పార్టీలో ప్రస్తావించలేదు.
3) హ్యాట్రిక్ పరాజయాలు: దాదాపు 50కి పైగా నియోజకవర్గాల్లోటీడీపీ హ్యాట్రిక్ పరాజయాలు పొందుతోంది. దీంతో ఆయా నియోజకవర్గాల్లో పార్టీని ఎలా ముందుకు నడిపించాలి? ఏయే అభ్యర్థులను బరిలో దింపాలి? అనే విషయాలపైనా మహానాడులో అంతర్మథనం సాగుతుందని.. ఒక కొలిక్కి తీసుకువస్తారని అనుకున్నారు. కానీ.. అసలు ఈ లోపాలు.. కుమ్ములాటలు.. క్షేత్రస్థాయిలో తర్జనభర్జనలపై ఏమాత్రం చర్చలు లేకుండా.. మహానాడు ముగిసిపోయింది.
This post was last modified on May 29, 2023 7:05 pm
అభిమానులు వీలు దొరికినప్పుడంతా ఓజి ఓజి అంటూ జపం చేస్తూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు కానీ నిజానికది ఈ…
కూటమిలో ప్రధాన రోల్ పోషిస్తున్న టీడీపీ.. ఇటు పాలనపరంగా.. అటు అభివృద్ధి, సంక్షేమాల పరంగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇప్పటికి…
వైసీపీ అధినేత జగన్కు షాకిచ్చే పరిణామం. రాష్ట్రంలోని బీజేపీ-టీడీపీ-జనసేనల కూటమిని ఆయన ఎంత తేలికగా తీసుకుంటున్నారో అందరికీ తెలిసిందే. ఈ…
కోలీవుడ్లో ఎన్నో విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొన్న హీరోల్లో శింబు ఒకడు. తన ప్రవర్తన అనేకసార్లు వివాదాస్పదమైంది. హీరోయిన్లతో ఎఫైర్లు.. నిర్మాతలు,…
అమరావతి రాజధాని ప్రాంతంలో శుక్రవారం జరిగిన బహిరంగ సభ.. వేదికపై జరిగిన కొన్ని కీలక పరిణా మాలు చూస్తే.. జనసేన…
ఏపీ సీఎం చంద్రబాబు కృషి ఫలించింది. ఆయన కలలు కంటున్న రాజధాని అమరావతి పేరు ఇప్పుడు జాతీయ స్థాయిలో మార్మోగుతోంది.…