Political News

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్  ప్లీజ్‌..

ఒక్క ఛాన్స్‌.. ఒకే ఒక్క ఛాన్స్ కోసం త‌పిస్తున్న యువ నేత‌లు.. వైసీపీ కంటే కూడా.. టీడీపీలో ఎక్కువ‌గా క‌నిపిస్తున్నారు. వీరిలో వార‌సులే ఎక్కువ‌గా ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో గుండుగుత్త‌గా చంద్ర‌బాబు వార‌సుల‌కు టికెట్లు ప్ర‌క‌టించారు. అయితే.. అనుకున్న విధంగా వార‌సులు గ‌ట్టెక్క లేక పోయారు. ఒక్క ఆదిరెడ్డి భ‌వానీ త‌ప్ప‌.. మిగిలిన వార‌సులు అంతా ఓట‌మి బాట‌పట్టారు. ఇప్ప‌టికే వీరంతా 30+ల‌లోకి వెళ్లిపోయారు. క‌నీసం ఇప్పుడైనా గెలుపు గుర్రం ఎక్కితే త‌ప్ప‌.. 30 ఏళ్ల‌లోనే ఎమ్మెల్యే అయ్యార‌నే పేరు వ‌స్తుంది.

లేక‌పోతే.. మ‌రో ఐదేళ్లు ఆగిపోవాలి. దీంతో యువ నేత‌లు.. ఇప్పుడుచంద్ర‌బాబు కోసం.. ఆయ‌న అనుగ్ర హం కోసం త‌పిస్తున్నారు. అయితే..వైసీపీ ఈసారి.. సీనియ‌ర్ల‌కే టికెట్లు ఇస్తుండ‌డంతో గ‌త ఎన్నిక‌ల‌లో చేసిన ప్ర‌యోగాలు విక‌టించిన ద‌రిమిలా.. చంద్ర‌బాబు వార‌సుల‌కు టికెట్లు ఇచ్చే విష‌యంపై అంత‌ర్మ థ‌నంలో ప‌డ్డార‌నేది వాస్త‌వం. కానీ, వార‌సుల విష‌యం మాత్రం త‌ర‌చుగా ఆయ‌న చెవిలో ప‌డుతూనే ఉంది. తాజాగా మ‌హానాడులో మ‌రోసారి యువ‌ర‌క్తం ప్ర‌స్తావ‌న వ‌చ్చింది. దీంతో ఆయ‌న 40 శాతం టికెట్లు వారికే ఇస్తామ‌ని ప్ర‌క‌టించారు. కానీ, నిర్ణీత లెక్క‌లు మాత్రం వెల్ల‌డించలేదు.

తాజాగా ప‌రిటాల సునీత మ‌రోసారి చంద్ర‌బాబును మ‌హానాడులో క‌ల‌వ‌డం.. ప్రాధాన్యం సంత‌రించుకుంది. అదేవిధంగా జేసీ బ్ర‌ద‌ర్స్ కూడా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌మ వార‌సుల‌నే మ‌రోసారి నిల‌బెడ‌తామ‌ని.. చంద్ర‌బాబుకు తేల్చి చెప్పారు. అదేవిధంగా రాజాం నుంచి గ్రీష్మ‌.. శ్రీకాకుళం లోని ప‌లాస వంటి నియోజ‌క‌వ‌ర్గాల‌పైనా.. సందిగ్ధ‌త నెల‌కొంది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో వీరి గ్రాఫ్ ఎలా ఉంద‌నేది ఇప్పుడు మ‌రోసారిచంద్ర‌బాబు ప‌రిశీల‌న‌కు తీసుకున్నారు.

యువ నేత‌ల‌జోరుతో సంబంధం లేకుండా.. ప్ర‌జ‌లు ఏమ‌నుకుంటున్నారు? అనేది ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌ధానంగా దృష్టి పెడుతున్న విష‌యం. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ సీనియ‌ర్ల‌ను నిల‌బెడుతున్న విష‌యం తెలిసిందే. వార‌సుల‌ను కాద‌ని.. సీనియ‌ర్ల‌కే ప్రాధాన్యం ఇస్తోంది.దీనిని ప్ర‌ధానంగా దృష్టిలో పెట్టుకున్న చంద్ర‌బాబు.. వార‌సుల ఆశ‌లు ఫ‌లించేలా నిర్ణ‌యం తీసుకుంటారా?  లేక‌.. ఏం చేస్తారు?  అనేది ఆస‌క్తిగా మారింది. వార‌సులు మాత్రం ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటున్నార‌నేది వాస్త‌వం. మ‌రి ఏం చేస్తారో చూడాలి. మ‌హానాడు త‌ర్వాత ప‌రిణామాలు మారే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on May 29, 2023 1:24 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

స‌లార్-1పై నిరాశ‌.. స‌లార్-2పై భ‌రోసా

బాహుబ‌లి-2 త‌ర్వాత వ‌రుస‌గా మూడు డిజాస్ట‌ర్లు ఎదుర్కొన్న ప్ర‌భాస్‌కు స‌లార్ మూవీ గొప్ప ఉప‌శ‌మ‌నాన్నే అందించింది. వ‌ర‌ల్డ్ వైడ్ ఆ…

4 hours ago

సినీప్రముఖుల ఇళ్ళపై రాళ్ల‌దాడి.. సీఎం రేవంత్ రియాక్ష‌న్!

ఐకాన్ స్టార్‌.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొంద‌రు వ్య‌క్తులు దాడికి దిగిన విష‌యం తెలిసిందే. భారీ ఎత్తున…

5 hours ago

తాతకు త‌గ్గ‌ మ‌న‌వ‌డు.. నారా దేవాన్ష్ `రికార్డ్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌న‌వ‌డు, మంత్రి నారా లోకేష్‌, బ్రాహ్మ‌ణి దంప‌తుల కుమారుడు నారా దేవాన్ష్‌.. రికార్డు సృష్టించారు. ఇటీవ‌ల…

7 hours ago

అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి.. ఎవరి పని?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జ‌రిగింది. ఈ ఘ‌ట‌న‌లో కొంద‌రు ఆందోళ‌న కారుల‌ను పోలీసులు అరెస్టు…

9 hours ago

అల్లు అర్జున్‌కు షాక్‌.. వీడియో బ‌య‌ట పెట్టిన సీపీ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మ‌రింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేట‌ర్ ఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే ఏ11గా కేసు న‌మోదు…

9 hours ago

మీకు కావలసినవన్నీ గేమ్ ఛేంజర్ లో ఇరుక్కు : చరణ్!

తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…

10 hours ago