రాజమండ్రి వేదికగా జరుగుతున్న మహానాడులో సంచలన తీర్మానాలు చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు దోపిడీదారుడికి, పేదలకు మధ్య ఇక యుధ్ధమేనని తొలి తీర్మానం చేశారు. సంపద దోచుకుం టున్న దోపిడీ దారులకు, పేదలకు మధ్య రాబోయే రోజుల్లో జరిగే యుద్ధం కీలక రాజకీయ పరిణామంగా పేర్కొంది. ప్రజలందరూ ఇందులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు ప్రవేశ పెట్టిన ఈ తీర్మానాన్ని మరో సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి బలపరిచారు.
రాష్ట్రంలో క్రిడ్ ప్రోకో, ఇన్‌సైడ్ ట్రేడింగ్, సూట్‌కేస్ కంపెనీలు, దోపిడీ, లూటీ వంటి పదాలన్నీ వినిపిస్తే గుర్తుకు వచ్చే ఒకేఒక్కడు జగన్మోహన్‌రెడ్డి అని. ల్యాండ్, శ్యాండ్, మైన్, వైన్, గంజాయి, డ్రగ్స్, రెడ్‌శాండల్.. ఇలా రాష్ట్రంలో పంచభూతాల్లో దేనినీ వదలకుండా లూటీ చేశాడు కాబట్టే.. దేశంలో ధనిక సీఎంగా గుర్తింపు పొందాడని యనమల అన్నారు.
రాబోయే ఎన్నికల్లో 40 శాతం సీట్లు యువతకు ఇవ్వాలని ఆలోచన చేస్తున్నట్లు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రకటించారు. సమాజాన్ని మార్చే శక్తి ఉన్న యువత రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. మహిళలు కూడా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మహానాడులో యువత సంక్షేమం.. యువగళంపై ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఆయన ఆమోదించారు.
“రాష్ట్రానికి మళ్లీ పెట్టుబడులు రావాలంటే టీడీపీతోనే సాధ్యమన్నారు. ఇప్పుడు ఇంట్లో ఉండిపోతే ఎలా సాధ్యం? వేరే మార్గం లేదు. టీడీపీకు మద్దతుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా యువత ఆలోచించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మీ ప్రాంతంలో జరిగే అలాంటి రాజకీయాలను అడ్డుకు ని.. మీ భవిష్యత్తు కోసం రాజకీయాలు ఉండాలని నిలదీయాలన్నారు. యువత సంక్షేమం.. యువగళం తీర్మానాన్ని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రవేశపెట్టారు. తెలుగు యువత నాయకుడు వరుణ్‌కుమార్ బలపరచారు.
మహిళా సంక్షేమ తీర్మానం.. రాష్ట్రంలోని మహిళలను మహాశక్తిగా తయారుచేసే కార్యక్రమాన్ని రూపొందించనున్నామని.. చంద్రబాబునాయుడు తెలిపారు. మహిళా శక్తిని గుర్తించింది.. నాయకత్వాన్ని పెంచింది టీడీపీయేనని తెలిపారు. ‘మహిళా సంక్షేమంలో కోతలు- అడ్డూ అదుపులేని అత్యాచారాలు, హత్యలు’ అంశంపై చేసిన తీర్మానాన్ని ఆయన మాట్లాడారు.
This post was last modified on May 28, 2023 4:08 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…