ఏపీలో 2024లో వచ్చే ఎన్నికలు తెలుగు దేశం పార్టీకి అత్యంత కీలకమనే విషయం తెలిసిందే. దీంతో పార్టీ అనేక రూపాల్లో పోరా టం చేస్తోంది. అయితే.. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో పనిచేస్తున్నా.. తమకు గుర్తింపులేదనే వారు ఉన్నారు. అదేసమయంలో ఇంచార్జ్‌లుగా ఉన్నవారు పనిచేయకపోయినా.. తమకే టికెట్లు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నవారు కూడా ఉన్నారు. మరోవైపు.. గత ఎన్నికల వరకు పార్టీలో ఉండి తర్వాత ఇతర పార్టీల గూటికి చేరిపోయినవారు.. మళ్లీ ఎన్నికల సమయానికి వచ్చేయాలనే ఆలోచనతో ఉన్నారు.
ఇవన్నీ ఇలా ఉంటే.. యువతకు ప్రాధాన్యం ఉంటుందా? టికెట్లు ఎప్పుడు ప్రకటిస్తారు? అనే ప్రశ్నలూ టీడీపీలో తరచుగా వెలుగు చూస్తున్నాయి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు.. పార్టీలో తమ్ముళ్ల సందేహాలకు నారా లోకేష్ కుండబద్దలు కొట్టినట్టు సమాధానం చెప్పారు. అంశాల వారీగా ఆయన వెల్లడించిన విషయాలు.. పార్టీలోని ప్రతి ఒక్కరికీ వర్తిస్తాయని కూడా చెప్పారు. మరి అవేంటో తెలుసుకుంటే.. టీడీపీలో తమ్ముళ్ల పరిస్థితి ఏంటనేది తెలుస్తుంది.
నారా లోకేష్ ఏమన్నారంటే..
1) చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేకపోతే వాళ్లకి గుర్తింపు లేదు.. ఇందులో నాకు కూడా మినహాయింపు లేదు.(ఇది ఓ ఎంపీ గురించి వ్యాఖ్యానించినట్టు పార్టీలో చర్చ సాగుతోంది) ఇంఛార్జ్లను నియమించినా పనిచేయని వారికి టిక్కెట్లు రావు. పార్టీ తరఫున స్వచ్ఛంద సేవ చేస్తామంటే ఎవరినైనా ప్రోత్సహిస్తాం.
2) నేను పని చేయను, ఇతరులూ చేయకూడదు అనే తత్వం సరికాదు. పని చేసేవారిని ఇన్ఛార్జ్లు ప్రోత్సహిస్తే సమష్టి కృషి అక్కడ ప్రతిబింబిస్తుంది. సేవా కార్యక్రమాలు చేసే వారు ఇన్ఛార్జ్కి సమాచారం ఇచ్చి వారి ఫోటో కూడా పెట్టి చేస్తే ఇబ్బంది లేదు, ఇన్ఛార్జ్ పెత్తనం చేస్తానంటే కుదరదు.
3) టిక్కెట్లు అనేవి నాయకుల సామర్ధ్యం బట్టి పార్టీ నిర్ణయిస్తుంది. ఇందులో లోకేశ్ అయినా.. వేరొకరైనా ఒక్కటే. సంక్షేమం అందుకుంటున్న నిరుపేదల కుటుంబాలు, తమ బిడ్డలకు ఉద్యోగ – ఉపాధి అవకాశాలు లభించాలంటే తెలుగుదేశం రావాలనే కోరుకుంటున్నారు.
4) టీడీపీలో సముచిత స్థానం, గౌరవం పొంది.. స్వార్థంతో పార్టీ వీడిన కొందరు ఇప్పుడు వస్తామన్నా పార్టీకి అవసరం లేదు. వారి స్థానంలో కొత్త తరం నాయకుల్ని తయారు చేసుకుంటాం.
5) రాయలసీమలో పాదయాత్ర పూర్తయ్యే నాటికి ఆ ప్రాంత అభివృద్ధికి రూట్ మ్యాప్ ప్రకటిస్తాం. తాగు, సాగునీటి వనరులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలపై రూట్ మ్యాప్ ప్రకటిస్తాం. యువగళం పాదయాత్రకు ఒక లక్ష్యం ఉంది. ఇది టైంపాస్ వ్యవహారం కాదు.
This post was last modified on May 28, 2023 12:26 am
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…