Political News

జగన్ మాస్టర్ మైండ్: బాబు

తెలుగుజాతి చరిత్ర తిరగరాసే రోజు వస్తుందని, రాష్ట్రాన్ని కాపాడాలని అందరూ సంకల్పం తీసుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. దేశంలో తెలుగుజాతిని అగ్రస్థానంలో నిలబెట్టాలని, సహకరిస్తే సరే.. అడ్డొస్తే తొక్కుకుంటూ పోతామని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మ‌హానాడు తొలి రోజు శ‌నివారం ప్ర‌సంగించిన ఆయ‌న ఆద్యంతం కార్య‌క‌ర్త‌ల‌ను ఉత్సాహ‌ప‌రిచేలా మాట్లాడారు. కార్యకర్తల త్యాగాలు తాను మర్చిపోనని, ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని స్పష్టం చేశారు.

సంపద సృష్టించడం తెలిసిన పార్టీ టీడీపీఅని.. సంపద పేదలకు పంచడం తెలిసిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జ‌గ‌న్ పాల‌న‌లో సంపద దోపిడీ ఎక్కువ.. ధరల బాదుడు ఎక్కువని విమర్శించారు. స్కాముల్లో జగన్‌ మాస్టర్ మైండ్ అని, సీఎం నోరు తెరిస్తే అన్నీ అబద్దాలేని, కోడికత్తి డ్రామా.. మద్య నిషేధం వంటివన్నీ డ్రామాలేనని ఎద్దేవా చేశారు.

రావణాసురుడు సాధువు రూపంలో వచ్చి సీతను ఎత్తుకెళ్లినట్టు.. ఒక్క ఛాన్స్ అంటూ జగన్ ఓట్లేయించుకు న్నారని విమర్శించారు. రూ 2 వేల నోట్లన్నీ జగన్ దగ్గరే ఉన్నాయని, పెద్ద నోట్ల రద్దుకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. సంక్షేమం తెలుసు.. సంపద సృష్టి తెలుసునని, అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలు పెట్టింది టీడీపీయేనని అన్నారు. పేదలకు ఫించన్లివ్వడం మొదలు పెట్టింది కూడా టీడీపీనే అన్నారు.

నాలుగేళ్ల క్రితం కొత్తగా వచ్చాడు.. ఒక్క ఛాన్స్ అన్నాడు, కోడి కత్తి అన్నాడు.. డ్రామా ఆడాడు.. రాష్ట్రాన్ని నాశనం చేయడం ప్రజా వేదిక నుంచే ప్రారంభించా“రని విమర్శించారు. అన్ని వ్యవస్థలను నాశనం చేశారని, ప్రపంచ చరిత్రలో ఎక్కడా రాజధాని లేని రాష్ట్రం లేదన్నారు. పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని, రాష్ట్రంలో రోడ్లు ఆధ్వాన్నంగా మారాయని విమర్శించారు. ప్రభుత్వ స్పాన్సర్స్ టెర్రరిజం పెరిగిందని, పెట్టుబడులు లేవని.. జాబ్ క్యాలెండర్ లేదని, నిరుద్యోగులకు దిక్కు తోచడం లేదని అన్నారు.

పుట్టబోయే బిడ్డపైనా అప్పు వేసేలా ఉన్నారని, సంక్షేమం, అభివృద్ధి టీడీపీ సైకిలుకున్న రెండు చక్రాలని, నాలుగేళ్లపాటు టీడీపీ కార్యకర్తలు ఎన్నో కష్టాలు పడినా ఎవ్వరూ భయపడలేదన్నారు. జై జగన్ అంటే వదిలేస్తామన్నా.. వినకుండా జై తెలుగుదేశం అంటూ ప్రాణాలొదిలిన కార్యకర్తలూ ఉన్నారన్నారు. కార్యకర్తల త్యాగాలకు సెల్యూట్ చేస్తున్నానని, భవిష్యత్తులో కార్యకర్తలని ఆదుకునే బాధ్యత తనదని చంద్రబాబు స్పష్టం చేశారు.

This post was last modified on May 27, 2023 10:21 pm

Share

Recent Posts

అమితాబ్ టెక్నిక్ ఫాలో అయితే… మీ స‌తీమ‌ణి టైమ్‌కి రెడీ!

ఏదైనా పెళ్లో.. మ‌రో ఫంక్ష‌నో.. భార్యా భ‌ర్త‌లు ఇరువురు వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్న‌ప్పుడు.. స‌హ‌జంగా దంప‌తుల్లో ఉత్సాహం ఉంటుంది. భ‌ర్త ముందుగానే…

4 hours ago

లెక్క తప్పుతున్న యూత్ సినిమాలు

యువతను లక్ష్యంగా పెట్టుకుని సినిమాలు తీయడం మంచిదే. అందులోనూ జెన్ జీ అభిరుచులను అర్థం చేసుకుని, వాళ్లకు అనుగుణంగా తక్కువ…

5 hours ago

నిన్న సందీప్ వంగ… నేడు శ్రీకాంత్ ఓదెల

మెగాస్టార్ చిరంజీవికి బయట జనంలోనే కాదు ఇండస్ట్రీలోనూ బోలెడు హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారనేది బహిరంగ రహస్యం. అది పలు…

6 hours ago

దీపావళికి డబ్బింగుల జోరు… టాలీవుడ్ హీరోలు లేరు

నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…

7 hours ago

విలక్షణ నటుడి విశ్వరూపం.. నేరుగా థియేటర్లోనే

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…

11 hours ago