రాజమహేంద్రవరంలో ప్రారంభమైన మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానోప న్యాసం చేశారు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికలను ఆయన కురుక్షేత్రంగా అభివర్ణించారు. వచ్చేది కురుక్షే త్రమని, ఆ ఎన్నికల్లో వైసీపీ కౌరవ సైన్యాన్ని తరిమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుందని అన్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా .. టీడీపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఆదివారం ఎన్నికల తొలి మేనిఫెస్టోను ప్రకటిస్తామని చెప్పారు.
ప్రస్తుతం రాష్ట్రం పిచ్చోడి చేతిలో రాయి మాదిరిగా ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఈ రాయి పేద లకు తగలకుండా టీడీపీ అడ్డు పడుతుందని, వచ్చే ఎన్నికల్లో ప్రజలను ముఖ్యంగా పేదవారిని, మహిళ లను ఎలా ఆదుకోవాలో టీడీపీకి తెలుసునని చెప్పారు. సంక్షేమానికి టీడీపీ జెండా.. అజెండా అని ఉద్ఘాటిం చారు. ఈసారి మహానాడుకు ఒక ప్రత్యేకత ఉందన్నారు.
ఎన్నో ‘మహానాడు’లను చూశాను. కానీ, ఇంతకుముందెప్పుడూ కనిపించని ఉత్సాహం ఇవాళ చూస్తున్నాను. ఎన్టీఆర్ శత జయంతిని ప్రపంచమంతా నిర్వహించుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా 100 ప్రదేశాల్లో ఏ నాయకుడికి జరగనంత గొప్పగా శతజయంతిని చేశాం. క్రీస్తు శకం మాదిరిగా ఎన్టీఆర్ శకం ప్రారంభమవుతుంది.. అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఆయన వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సి ఉందని చెప్పారు.
సంపద సృష్టించి పేదలకు పంచుతామని చెప్పారు. కానీ, జగన్ మనస్తత్వం మాత్రం తాను ఒక్కడే తినాలనే లక్షణం ఉన్నవాడని చంద్రబాబు విమర్శించారు. ఈ నాలుగేళ్లలో జగన్ చేసిన అవినీతి 2.27 లక్షల కోట్లుగా ఉందని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన జగన్ నుంచి దీనిని ఎలా కాపాడుకోవాలనే విషయంపై తాము దృష్టి పెట్టామన్నారు. దేశంలోని అందరు ముఖ్యమంత్రుల కన్నా కూడా జగన్ అత్యంత ధనవంతుడని పేర్కొన్నారు.
This post was last modified on May 27, 2023 4:47 pm
కీలక నిర్ణయాన్ని తీసుకుంది రేవంత్ సర్కారు. హైదరాబాద్ మహానగరి విస్త్రతిని పెంచేస్తూ అంచనాల్ని సిద్ధం చేసింది. ఇప్పటివరకు హెచ్ఎండీఏ (హైదరాబాద్…
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…