Political News

వివేకా హత్య: నిజం చెబితే చంపేస్తా.. అన్నాడు

ఏపీ సీఎం జ‌గ‌న్ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య కేసులో త‌వ్విన కొద్దీ అనేక సంచ‌ల‌నాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో వివేకా ఇంటి వాచ్‌మెన్ రంగ‌య్య‌ను ‘నిజం చెబితే చంపేస్తా’ అని ఏ1 గంగిరెడ్డి తీవ్రంగా బెదిరించిన విష‌యం తాజాగా వెలుగు చూసింది. వివేకా హత్య గురించి పోలీసులకు నిజాలు చెబితే చంపేస్తానని వాచ్‌మన్‌ రంగన్నను ఈ కేసులో ఏ–1 ఎర్ర గంగిరెడ్డి బెదిరించారని సీబీఐ తెలిపింది.

‘ఈ హత్య కేసు విస్తృత కుట్రలో రెండు ప్రధాన చర్యలు ఉన్నాయి. ఒకటి.. హత్య చేయడం. రెండోది.. సంఘటనా స్థలంలో ఆధారాలను ధ్వంసం చేయడం. వీటిలో ఎర్ర గంగిరెడ్డి క్రియాశీలకంగా పాల్గొన్నారు’ అని పేర్కొంది. ఆయన బెయిల్‌ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు.. ఆయన్ను జూలై 1న తిరిగి విడుదల చేయాలని ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ వివేకా కుమార్తె సునీతారెడ్డి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌పై సీబీఐ డీఐజీ, దర్యాప్తు అధికారి కేఆర్‌ చౌరాసియా కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశారు.

అందులో కీలక అంశాలను పొందుపరిచారు. ఎర్రగంగిరెడ్డి ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను బెదిరిస్తు న్నట్లు తమ దర్యాప్తులో తేలిందన్నారు. సీబీఐపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ దర్యాప్తును అడ్డుకోడానికి ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలను పలుసార్లు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ హైకోర్టులు పరిగణనలోకి తీసుకు న్నాయి. ఏపీ పోలీసులు సకాలంలో చార్జిషీటు దాఖలు చేయని కారణంగా ఎర్రగంగిరెడ్డి డీఫాల్ట్‌ బెయిల్‌ పొందారు.

దానివల్ల ఈ కేసులో యాదాటి సునీల్‌ యాదవ్‌, గజ్జల ఉమాశంకర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి, వైఎస్‌ భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేయగలిగినా కీలక నిందితుడైన గంగిరెడ్డిని అదుపులోకి తీసుకోలేకపోయామ‌ని సీబీఐ పేర్కొంది. అందుకే ఆయనకిచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని కోర్టులను ఆశ్రయించామంది. గంగిరెడ్డి మరో ముగ్గురితో కలిసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని సీబీఐ అఫిడవిట్‌లో వివరించింది.

This post was last modified on May 27, 2023 11:18 am

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

1 hour ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

3 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

5 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago