వడ్డించే పన్నులు కావొచ్చు.. పెరిగే ధరలు కావొచ్చు. అంతకంతకూ పెరగటమే తప్పించి తగ్గటం ఎప్పుడైనా చూశామా? అంటే.. లేదనే చెబుతాం. అందుకు భిన్నంగా ఏపీలోని జగన్ సర్కారు అనూహ్య నిర్ణయాన్ని తీసుకోనుంది.
ఏపీలో మద్యం ధరల్ని భారీగా పెంచేస్తూ ఇటీవల నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఇరుగు పొరుగున ఉన్న తెలంగాణ.. తమిళనాడు..కర్ణాటక రాష్ట్రాలతో పోలిస్తే.. ఏపీలో మద్యం ధరలు భారీగా ఉండటమే కాదు.. ముట్టుకుంటే కాలిపోయేలా ధరల్ని సెట్ చేశారు.
అలా చేయటం ద్వారా మద్యాన్ని కొనుగోలు చేసే విషయంలో ఆసక్తి తగ్గి.. తమ లక్ష్యమైన పాక్షిక మద్ యనిషేధం దిశగా ప్రజల్ని సిద్ధం చేయాలని జగన్ సర్కారు భావించింది. అందుకు భిన్నంగా.. మద్యం ధరలు భారీగా పెరిగిపోవటంతో.. ఇటీవల కాలంలో శానిటైజర్లు తాగేసి చనిపోతున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. చేతిలో డబ్బుల్లేక.. మద్యం ధరలు భారీగా ఉండటంతో చౌకగా లభించే శానిటైజర్లను సేవిస్తూ.. ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఉదంతాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.
ఈ నేపథ్యంలో మద్యం ధరల్ని భారీగా తగ్గించే దిశగా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న మద్యం ధరల్ని భారీగా తగ్గించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్లుగా సమాచారం. ఇప్పటికి ఉన్న ధరల్లో 45 శాతం మేర తగ్గించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మద్యం ధరల్ని భారీగా పెంచేస్తే.. మేలు జరుగుతుందన్న దానికి భిన్నంగా వరుస దారుణాలు చోటు చేసుకోవటం.. సరిహద్దురాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం సరఫరా కావటంతో పెంచిన ధరల్ని తగ్గించాలన్న ఆలోచనకు ఏపీలోని జగన్ సర్కారు నిర్ణయించినట్లుగా తెలిసింది.
This post was last modified on August 8, 2020 10:01 am
ఏపీ నూతన రాజధాని అమరావతికి నూతనోత్తేజం వచ్చేసింది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేజిక్కించుకోవడంతోనే అమరావతికి…
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…