Political News

క‌డ‌ప‌లో యువ‌గ‌ళం ఎఫెక్ట్ ఎంత‌…

ఏపీ సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌. ఇప్ప‌టి వ‌ర‌కు వైసీపీకి తిరుగులేని జిల్లాగా పేరు తెచ్చుకుంది. అంతేకా దు.. కొన్నినియోజ‌క వ‌ర్గాల్లో వైసీపీకి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం కూడా ప‌ట్టారు. అయితే.. అలాంటి జిల్లాపై ఇప్పుడు సీఎం జ‌గ‌న్‌కు అనుమానపు మేఘాలు ముసురుకున్నాయి. దీనికి కార‌ణం.. టీడీపీ యువ నేత నారా లోకేష్ యువ‌గ‌ళం ఇక్క‌డ ప్రారంభం కావ‌డ‌మే. ఇటీవ‌ల చంద్ర‌బాబు సైతం ఇక్క‌డ ప‌ర్య‌టించారు.

ఇక‌, వైనాట్ పులివెందుల నినాదంతో పార్టీ నాయ‌కులు కూడా దూసుకుపోతున్నారు. ప్ర‌తి ఇంటినీ ట‌చ్ చేస్తున్నారు. ఇదంతా టీడీపీలో సైలెంట్‌గా జ‌రిగిపోతోంది. ఈ నేప‌థ్యంలో తమ కూసాలు బ‌లంగా ఉన్నా యా? క‌ద‌ల బారుతున్నాయా? అని వైసీపీలో అనుమానం రేగింది. దీంతో కొన్నాళ్ల కింద‌టే ఇక్క‌డ ఐప్యాక్ స‌ర్వేను రంగంలోకి దింపిన‌ట్టు స‌మాచారం. వీరు ముఖ్యంగా మూడు అంశాల‌పై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

ప్ర‌స్తుత ఎమ్మెల్యేల ప‌నితీరు: ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేల ప‌నితీరు ఎలా ఉంది? వారు గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ముందుకు తీసు కువెళ్తున్నారా? లేదా? ప్ర‌జ‌ల అభిప్రాయం ఎలా ఉంది? సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న‌వారు ఎలా రియాక్ట్ అవుతున్నారు? ఎమ్మెల్యేల‌కు.. ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య అవినాభావ సంబంధం కొన‌సాగుతోందా? లేదా? అనే కీల‌క అంశాల‌పై దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

వైఎస్ కుటుంబ నేత‌ల‌ ప‌రిస్థితి: వైసీపీకి క‌డ‌ప‌లో కొన్ని కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి. వాటిలో క‌మ‌లాపురం ఒక‌టి. ఇక్క‌డ‌ వైఎస్ కుటుంబ బంధువులే పోటీకి దిగే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వారి ప‌రిస్థితి ఎలా ఉంటుంది? వారిలో ఎవ‌రు విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంది? అనే కోణంలోనూ ఐప్యాక్ స‌ర్వే సాగుతున్న‌ట్టు తెలుస్తోంది. ముఖ్యంగా క‌మ‌లాపురం(జ‌గ‌న్ సొంత మేన‌మామ ర‌వీంద్ర‌నాథ్‌రెడ్డి) నియోజ‌క‌వ‌ర్గంలో ర‌వీంద్ర‌నాథ్ వ‌రుస‌గా గెలుస్తున్నారు.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న వార‌సుడిని రంగంలోకి దింపాల‌ని భావిస్తున్నారు. అదేస‌మ‌యంలో జ‌గ‌న్‌కు బాబాయిల వ‌ర‌స‌య్యే మ‌రికొంద‌రు కూడా రంగంలో ఉన్నారు. దీంతో ఇక్క‌డ ఎవ‌రికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ల‌భిస్తోంద‌నే అంశంపై స‌ర్వే సాగుతోంది. మార్పుత‌ప్ప‌ద‌నే: కొన్నాళ్లుగా క‌డ‌ప‌లో మార్పు త‌ప్ప‌ద‌నే నియోజ‌క‌వ‌ర్గాలు కూడా ఉన్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. మెత‌క వైఖ‌రి అవ‌లంబిస్తున్న నాయ‌కులు.. ప్ర‌తిప‌క్షాల‌కు స‌రైన స‌మాధానం చెప్ప‌కుండా నేత‌ల‌కు చెక్ పెట్టాల‌ని పార్టీ భావిస్తోంది. ఇలాంటి వాటిలో బ‌ద్వేల్ నియోజ‌క‌వ‌ర్గం పేరు బాహాటంగా వినిపిస్తోంది.

ఇక్క‌డ నుంచి డాక్ట‌ర్ సుధ గ‌త ఏడాది జ‌రిగిన ఉప పోరులో విజ‌యం ద‌క్కించుకున్నారు. కానీ. విప‌క్షాల‌కు కౌంట‌ర్ ఇవ్వ‌లేక పోతున్నారు. దీంతో ఆమెను మార్చ‌క త‌ప్ప‌ద‌ని అంటున్నారు. ఇలాంటి వాటిపై కూడా.. స‌ర్వే సాగుతోంది. మ‌రోవైపు యువ‌గ‌ళం ఎఫెక్ట్‌పైనా.. చ‌ర్చ‌సాగుతోంది. మ‌ర ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on May 26, 2023 2:52 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

54 minutes ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

1 hour ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

3 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

3 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

4 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

5 hours ago