Political News

నిన్న జ‌గ‌న్‌.. ఈ రోజు చంద్ర‌బాబు.. ఒకే ప‌నిచేశారుగా!!

ఒకే ఒరలో రెండు క‌త్తులు ఇమ‌డ‌వ‌ని అంటారు. అలాగే.. ప‌ర‌స్ప‌ర విరుద్ధ‌మైన పార్టీల నేత‌ల అభిప్రాయాలు .. ల‌క్ష్యాలు కూడా క‌ల‌వ‌వు. ముఖ్యంగా ఏపీ వంటిరాష్ట్రంలో అధికార పార్టీ వైసీపీ ఒక‌టంటే.. ప్ర‌తిప‌క్షం టీడీపీ మ‌రొక‌టి అంటుంది. అలాంటి రెండు పార్టీలు కూడా ఒక విష‌యంలో క‌లిసిపోయాయి. ఇరు పార్టీలు కూడా ప్ర‌ధాని మోడీ విష‌యానికి వ‌చ్చేస‌రికి రెండు పార్టీలు కూడా.. జై కొట్టాయి.

అదే.. కొత్త పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వానికి సంబంధించి అటు వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ప్ర‌ధాని మోడీకి జై కొట్టిన మ‌రుస‌టి రోజే టీడీపీ అధినేత కూడా జేజేలు ప‌లికారు. దీంతో ఇరు పార్టీల వ్య‌వ‌హారం..చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్లమెంట్ కొత్త భవనం ప్రారంభోత్సవంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తాజాగా ట్వీట్ చేశారు.

కొత్త పార్లమెంట్ భవన నిర్మాణం చరిత్రాత్మకమైందని, చారిత్రాత్మక కట్టడాన్ని నిర్మించడంలో దోహదపడిన ప్రధాని మోడీకి, కేంద్రానికి అభినందనలు తెలుపుతున్నట్లు చంద్రబాబు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. చట్టాల రూపకల్పనకు పార్లమెంటు భవనం వేదిక కావాలని, 2047 నాటికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి పేదలు లేని దేశం కోసం కొత్త పార్లమెంట్ భవనం దిక్సూచి కావాలని చంద్రబాబు అన్నారు.

కేంద్ర ప్ర‌బుత్వ ఆహ్వానం మేరకు త‌మ పార్టీ ఎంపీల‌ను కార్య‌క్ర‌మానికిపంపిస్తున్న‌ట్టు తెలిపారు. అయితే.. పార్ల‌మెంటు భ‌వ‌నం ప్రారంభోత్స‌వం నాడు.. త‌మ పార్టీ(టీడీపీ) వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ జ‌యంతి ఉన్నందున తాను రాలేక పోతున్నాన‌ని కేంద్రానికి పంపిన లేఖ‌లో చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు.

This post was last modified on May 26, 2023 10:03 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

భారత్ – పాక్: యుద్ధం జరిగితే ఐరాస ఏం చేస్తుంది?

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఉద్రిక్తతలు తీవ్రమవుతున్నాయి. ఒకవేళ ఈ పరిస్థితి యుద్ధంగా మారితే, ఐక్యరాజ్య సమితి…

30 minutes ago

తొమ్మిదేళ్లకు దక్కిన ‘మెగా’ అవకాశం

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కలయికలో తెరకెక్కబోయే సినిమా షూటింగ్ ఈ నెల మూడో వారంలో ప్రారంభం కానుంది.…

40 minutes ago

శ్రీవిష్ణు ‘సింగిల్’కు డబుల్ ఛాన్స్

ఈ వారం విడుదల కాబోతున్న సినిమాల్లో హీరో ఇమేజ్, మార్కెట్, క్యాస్టింగ్ పరంగా ఎక్కువ అడ్వాంటేజ్ ఉన్నది సింగిల్ కే.…

2 hours ago

కియారా… బేబీ బంప్‌తో మెగా గ్లామర్

కియారా అద్వానీ.. బాలీవుడ్, తెలుగు సినిమాల్లో ప్రముఖ నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని అందుకున్న విషయం తెలిసిందే. ఫగ్లీ…

3 hours ago

ఐపీఎల్ 2025 ప్లేఆఫ్స్: టాప్-4లోకి వచ్చేదెవరు?

ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై…

5 hours ago

స్వచ్ఛందంగా వెళ్లిపోతే 1000 డాలర్లు బహుమతి!

డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం అక్రమ వలసదారులను స్వదేశాలకు తిరిగి పంపే ప్రక్రియను వేగవంతం చేయడానికి కొత్త విధానాన్ని…

7 hours ago