లాక్ డౌన్ వేళ అనేక మంచి పనులు చేశారు మెగాస్టార్ చిరంజీవి. సినీ కార్మికులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టడంతో పాటు కరోనా మీద అవగాహన కల్పించేలా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు ఆయన మరో మంచి పనికి శ్రీకారం చుట్టారు. కోవిడ్ చికిత్సలో అత్యంత కీలకంగా మారిన ప్లాస్మా దానంపై జనాల్లో అవగాహన పెంచే పనిలో పడ్డారు. ఇప్పటికే ఈ విషయమై వీడియోల ద్వారా జనాల్ని జాగృతం చేసే ప్రయత్నం చేశారు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో ప్లాస్మా దాతల్ని సన్మానించారు. సైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్‌తో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
కరోనాను జయించి కోవిడ్ పేషంట్లకు ప్లాస్మా దానం చేసిన 150 మందిని చిరంజీవి, సజ్జనార్ కలిసి సన్మానించడంతో పాటు ప్రెస్ మీట్ నిర్వహించి.. ప్లాస్మా దానంపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మాట్లాడుతూ.. మధ్యలో దగ్గారు. దీంతో సమావేశంలో చిన్న అలజడి రేగింది. చిరంజీవి వెంటనే తమాయించుకుని.. తాను దగ్గుతున్నానని కంగారు పడాల్సిన పని లేదని.. తాను బాగానే ఉన్నానని అన్నారు.
ఈ రోజుల్లో మామూలుగా దగ్గు వచ్చి దగ్గడానికి కూడా భయపడాల్సి వస్తోందని చిరు అనడంతో అందరూ నవ్వారు. ప్లాస్మా.. కరోనా సోకిన వారికి సంజీవినిలా పనిచేస్తోందన్న చిరు.. కరోనాను జయించిన వారిలో మూడు నెలల పాటు యాంటీ బాడీస్ ఉంటాయని.. ప్లాస్మాలోని యాంటీ బాడీస్ 24 గంటల నుంచి 48 గంటల్లోపు తిరిగి వస్తాయని.. కరోనా జయించిన ఒక్కో వ్యక్తి 30 సార్లు ప్లాస్మా డొనేట్ చేయవచ్చని చెప్పారు.
This post was last modified on August 8, 2020 7:56 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…