యువగళం పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీడీపీ యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. అహరహం శ్రమిస్తున్నారు. యాత్ర సాగుతున్న తీరును నిరంతరం ఆయన సమీక్షించుకుంటు న్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి క్విక్‌గా తయారై.. వెంటనే సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎంత మంది వచ్చినా.. సెల్ఫీలు తీసుకుంటున్నా రు. అదేవిధంగా పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో సమస్యలు తెలుసుకుంటున్నారు.
దీనిపై ప్రత్యేకంగా నోట్స్ కూడా రాసుకుంటున్నారు. పైకి కనిపించేవి కొన్ని ఉంటే.. కనిపించనవి ఈ యాత్రలో చాలానే ఉంటున్నా యి. కొన్ని సామాజిక వర్గాలకు నారా లోకేష్ ఇచ్చిన హామీలను తన డైరీలో ప్రత్యేకంగా ఆయన రాసుకుంటున్నారు. అదేవిధం గా యువతకు ఏటా జాబ్ క్యాలెండర్, మహిళలకు వ్యక్తిగత రుణాలు, వడ్డెర సామాజిక వర్గానికి ఎస్టీ హోదా.. వంటివాటిని మేనిఫెస్టోలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు.
ఇక, సాయంత్రం పాదయాత్ర ముగించిన తర్వాత.. శిబిరానికిచేరుకుని.. అక్కడే ఉన్నా.. రెస్ట్ తీసుకోకుండా.. రోజంతా జరిగిన పాదయాత్ర వివరాలను రాసుకుంటున్నారు. వాటినే మీడియాకు పంపిస్తున్నారు. అదే సమయంలో పార్టీపరంగా యాక్టివ్‌గా ఉన్న నాయకులు ఎవరు.. ఎవరెవరు.. ఎంత సేపు యాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలను ఎలా మొబిలైజ్ చేస్తున్నారు? వంటి అన్ని విషయాలను కూడా నారా లోకేష్ నమోదు చేసుకుంటున్నారు.
ఈ విషయంలో ఏ చిన్న తేడా వచ్చిందని భావించినా.. ఆయన శిబిరానికి పిలిచి నాయకులను ప్రశ్నిస్తు న్నట్టు సమాచారం. అంతేకాదు.. ఇప్పటి వరకు పాదయాత్ర నిర్వహించిన అనంతపురం, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో వైసీపీ లోటు పాట్లు, ఎమ్మెల్యేల వ్యక్తిగత వివరాలను కూడా అడిగి తెలుసుకున్నారు. తద్వారా.. వారికి దీటైన అభ్యర్థులకే వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్‌లు ఇచ్చే అవకాశం ఉందనే అంచనాలు వస్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. యువగళం అంత ఆషామాషీగా అయితే.. నిర్వహించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on May 25, 2023 11:38 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…