Political News

ఇది ప‌రోక్షంగా ఉమాకు మైన‌స్ అవుతోంది

ఎన్నిక‌ల్లో గెలుస్తామ‌నే ధీమా.. గెలుపు గుర్రం నాదే అనే భారీ అంచ‌నాలు.. ఏ నాయ‌కుడికైనా ఉండాల్సిందే. అలా ఉండ‌డం కూడా త‌ప్పుకాదు. అయితే.. దానినే న‌మ్ముకుని అలానే ఉండిపోతే.. అది సాకారం అవు తుందా? ఇంకా ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మయం ఉంది క‌దా.. అని నిర్లిప్తంగా ఉంటే స‌రిపోతుందా? ఇప్పుడు ఇవే ప్ర‌శ్న‌లు .. విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీలో వినిపిస్తున్నాయి.

ఇక్క‌డ నుంచి గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం 25 ఓట్ల తేడాతో ప‌రాజ‌యం చ‌విచూశారు.. టీడీపీ నాయ‌కుడు బొండా ఉమామ‌హేశ్వ‌ర‌రావు. అయితే.. దీనికి కార‌ణాలు వెతుక్కుని.. దానిని స‌రిచేసుకునే ప్ర‌య‌త్నం మాత్రం ఆయ‌న చేయ‌డం లేదు. పైగా మ‌ద్య‌లో పార్టీ మారుతున్న‌ట్టు కూడా సంకేతాలు ఇచ్చారు. ఇది ఇప్ప‌టికీ వినిపిస్తూనే ఉంది. కుదిరితే జ‌న‌సేన‌లోకి వెళ్తారంటూ.. ఇప్ప‌టికీ బొండా అనుచ‌రులు చెప్పుకొంటున్నారు.

ఇక‌, టీడీపీ ప‌రంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు.. బాదుడే బాదుడు.. ఇదేం ఖ‌ర్మ వంటి కార్య‌క్ర‌మాల‌కు.. బొండా ఎక్క‌డా పార్టిసిపేష‌న్ లేదు. ఏదో ఒక‌టి రెండు కార్య‌క్ర‌మాలు చేసేసి.. మీడియా ముందుకు వ‌చ్చి వైసీపీ స‌ర్కారుపై విరుచుకుప‌డ‌డం ద్వారా.. ప‌రిస్థితి అంతా బాగుంద‌నే ధోర‌ణిలోనూ.. త‌న‌కు అనుకూలంగా ఉంద‌ని అనుకోవ‌డంతోనూ ఆయ‌న స‌రిపెడుతున్నార‌ని.. టీడీపీలోనే ఓవ‌ర్గం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.

పైగా ఎంపీతో విభేదాలు.. స‌మ‌సిపోలేదు. ఇదిలావుంటే.. మ‌రోవైపు వైసీపీ నాయ‌కుడు, ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణు ఇంటింటికీ తిరుగుతున్నారు. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుంటున్నారు. ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇటీవ‌ల కొన్ని స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌తో క‌లిసి.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం.. ప్ర‌య‌త్నించారు. దీంతో నిన్న‌మొన్న‌టి వ‌ర‌కు ఎమ్మెల్యే రావ‌డం లేద‌ని.. చెప్పిన ప్ర‌జ‌లు.. ఎమ్మెల్యే వ‌స్తున్నార‌నే టాక్ వినిపిస్తున్నారు. ఇది ప‌రోక్షంగా బొండా ఉమాకు మైన‌స్ అవుతోంది. నా గెలుపు రాసిపెట్టుకోవ‌చ్చ‌న్న ఆయ‌న ఇప్పుటికైనా తిర‌గ‌క‌పోతే.. ఇబ్బందేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Share
Show comments
Published by
Satya

Recent Posts

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

4 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

4 hours ago

సూర్య అభిమానులు కోపంగా ఉన్నారు

తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…

4 hours ago

క్రిస్మస్‌కు ఎన్ని సినిమాలు బాబోయ్

అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…

5 hours ago

రచయితగా కొత్త రూటులో టాలీవుడ్ హీరో?

ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…

7 hours ago

మెస్సీ వచ్చే… మంత్రి పదవి పాయె

దేశంలో ఫుట్బాల్ దిగ్గజం మెస్సీ ఈవెంట్ ముగిసి మూడు రోజులు అయింది. అయితే కలకత్తా లో జరిగిన గందరగోల పరిణామాలు…

8 hours ago