Modi
ఒకటి కాదు..రెండు కాదు.. ఏకంగా 19 పార్టీలు.. ప్రధాని మోడీపై నిప్పులు చెరిగాయి. “మేం వచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి. ప్రజాస్వామ్యం మీ మూతి మీద మీసమా.. అలానే తిప్పుకోండి!” అంటూ తీవ్ర వ్యాఖ్యాలు చేశాయి. దీనికికారణం.. పార్లమెంటు నూతన భవనాన్ని రాజ్యాంగ అధినేతగా రాష్ట్రపతి కాకుండా ప్రధానమంత్రి ప్రారంభించడానికి రెడీ కావడమే.
దాదాపు 200 కోట్ల రూపాయల ఖర్చుతో ఢిల్లీలో ‘సెంట్రల్ విస్టా’ పేరుతో కొత్త పార్లమెంటు భవనాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో తొలి దశ ప్రధాన నిర్మాణాన్ని మోడీ చేతుల మీదుగా ఈ నెల 28న ప్రారంభించనున్నారు. అయితే.. రాజ్యాంగ వేదిక అయిన.. పార్లమెంటును రాజ్యాంగ పరిరక్షణ కర్త అయిన.. రాష్ట్రపతి ప్రారంభించాలి కానీ.. ఇలా ప్రధాని ప్రారంభించడం ఏంటనేది.. విపక్ష నాయకుల విమర్శ.
ఈ క్రమంలోనే అనేక తర్జన భర్జనల అనంతరం.. కాంగ్రెస్, డీఎంకే, ఆప్, శివసేన(యూబీటీ), సమాజ్‌వాదీ పార్టీ, సీపీఐ, జేఎంఎం, కేరళ కాంగ్రెస్(మణి), వీసీకే(విడుతలై చిరుతైగల్ కట్చి), ఆర్‌ఎల్‌డీ, టీఎంసీ, జేడీ(యూ), ఎన్‌సీపీ, సీపీఎం, ఆర్జేడీ, ఐయూఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఆర్‌ఎస్‌పీ, ఎండీఎంకే వంటి 19 పార్టీలు ఈ ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాయి. ఆయా పార్టీలకు ఇప్పటికే పార్లమెంటు స్పీకర్ నుంచి ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే.
‘పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతితో కాకుండా ప్రధాని మోడీ ప్రారంభించనుండటం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే. ఈ తీరు రాజ్యాంగ స్ఫూర్తిని ఉల్లంఘించడం కిందికే వస్తుంది. ఈ అప్రజాస్వామిక చర్యలు ప్రధాని మోడీకి కొత్తేం కాదు. పార్లమెంట్‌లో విపక్ష నేతలు భారత ప్రజల సమస్యలను లేవనెత్తి నప్పుడు వారిపై అనర్హత వేటు వేశారు. సస్పెండ్ చేశారు. వారి మాటలను మ్యూట్ చేశారు. పార్లమెంట్ నుంచి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పక్కన పెట్టినప్పుడు.. ఇక కొత్త భవనంలో మాకు ఏ విలువా కనిపించడం లేదు’ అని విపక్ష పార్టీలు తమ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశాయి.
This post was last modified on May 24, 2023 5:19 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…