తాము అభిమానించే నేతలను ఆకాశానికి ఎత్తేస్తూ అభిమానులు చేసే నినాదాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తాజాగా అలాంటి సీన్ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టిన రోజు సందర్భంగా చోటు చేసుకుంది. అయితే.. అభిమానుల నినాదాలకు ఎంపీ కోమటిరెడ్డి కాస్త భిన్నంగా రియాక్టు అయ్యారు. తన పుట్టిన రోజును ఒక మోస్తరు హడావుడిగా చేసుకునే కోమటిరెడ్డి.. ఈసారి అందుకు భిన్నంగా కాస్త భారీగా ఉండేలా చేసుకోవటం గమనార్హం. తన అరవయ్యో పుట్టిన రోజును కోమటిరెడ్డి గ్రాండ్ గానే జరుపుకున్నారు.
ఎన్నికలు మరో నాలుగు నెలలకు వచ్చేసిన వేళ.. ఆయన మాటల్లోనూ.. చేతల్లోనూ తేడా కనిపించింది. హైదరాబాద్ నుంచి బ్రాహ్మణ వెల్లెంల వరకు భారీ ప్రదర్శగా వచ్చిన ఆయన.. తాను కేక్ కట్ చేసే కార్యక్రమానికి హాజరైన వేలాది మందిని ఉద్దేశించి చేసిన ప్రసంగం ఆసక్తికరంగా మారింది. ఆయన్ను ఉద్దేశించి.. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేశారు. దీంతో కోమటిరెడ్డి రియాక్టు అయితే.. వారే మాత్రం ఊహించని రీతిలో రియాక్టు అయ్యారు.
‘‘నన్ను మీరు అలా అనొద్దు. మీరు అలా అంటే అంతా కలిసి నన్ను ఓడిస్తారు’’ అంటూ వ్యాఖ్యానించారు. అదే సమయంలో.. తాను సీఎం రేసులో ఉన్న విషయాన్ని తన మాటలతో చెప్పకనే చెప్పేయటం విశేషం. ‘‘తెలంగాణ కోసం మంత్రి పదవినే వదిలేశా. నాకు ముఖ్యమంత్రి పదవి మీద మోజు లేదు. నేను అనుకుంటే ముఖ్యమంత్రి పదవే నడుచుకుంటూ వస్తుంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి పని చేస్తాం. తెలంగాణలో కాంగ్రెస్ కు 70-80 సీట్లు రావటం ఖాయం’’ అంటూ ధీమాను వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 70 సీట్లు రాకుంటే తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేయటం గమనార్హం. కాంగ్రెస్ లో వర్గ పోరు లేదని.. ఉమ్మడి నల్గొండలోని అన్ని అసెంబ్లీ స్థానాల్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటుందన్న కోమటిరెడ్డి.. ఈ నెల 26న ముఖ్యనేతలంతా కలిసి రాహుల్ గాంధీని.. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కానున్నట్లు వెల్లడించారు.
This post was last modified on May 24, 2023 12:04 pm
2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…
వైసీపీ మాజీ నాయకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి మళ్ళీ రాజకీయాల్లోకి రావాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇటీవల…
ఈ రోజుల్లో రీమేక్ సినిమా చేయడం అన్నది పెద్ద రిస్క్‌గా మారిపోయిన మాట వాస్తవం. ఇంటర్నెట్, ఓటీటీల విప్లవం వల్ల…
గత వారం విడుదల వాయిదా పడిన అఖండ 2 కొత్త డేట్ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా…
తన పేరు, రూపం, ఫోటోలను అనుమతి లేకుండా కొందరు దుర్వినియోగం చేయడం పట్ల జూనియర్ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటీషన్…
డిసెంబర్ 12 సూపర్ స్టార్ రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా పడయప్పా (నరసింహ) ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేస్తున్నారు.…