అప్పు చేసి పప్పు కూడు తినరా.. ఓ నరుడా! అన్న సూత్రం ఏపీకి బాగానే వర్తిస్తోందని అంటున్నారు పరిశీలకులు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2023-24) ప్రారంభమై.. కేవలం నెలన్నరే అయింది(ఏప్రిల్-మే15). అయితే.. ఈనెలన్నర కాలంలో ఏపీ ప్రభుత్వం ఏకంగా 13,500 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది. తాజాగా దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆర్బీఐ మరో రెండు వేల కోట్ల రూపాయల అప్పు ఇచ్చింది. మంగళవారం సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ప్రభుత్వం రూ. రెండు వేల కోట్ల రుణం తెచ్చింది.
ఇక, తాజాగా తెచ్చిన అప్పునకు వడ్డీ ఠారెత్తి పోతోంది. రూ.వెయ్యి కోట్లు 11 సంవత్సరాలకు 7.36 శాతం వడ్డీ, మరో వెయ్యి కోట్లు 15 సంవత్సరాలకు 7.30 శాతం వడ్డీకి రుణం తీసుకుంది. దీంతో ఇప్పటి వరకు ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రం ఇచ్చిన ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిలో జగన్ ప్రభుత్వం రూ.13 వేల 500 కోట్లు అప్పు చేసినట్టు అయింది. ఇంకా మిగిలింది రూ. 17 వేల 500 కోట్లే… ఈ లోపు ఆర్ధికలోటు కింద ఏపీ ప్రభుత్వానికి కేంద్రం రూ. 10 వేల కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసింది.
2014-2019 వరకూ టీడీపీ ప్రభుత్వం ఆర్ధికలోటు విడుదల చేయాలన్నా అవసరం లేదని కేంద్రం పిడివాదన వినిపించింది. తాజాగా రెవెన్యూ లోటు కింద నిధులు విడుదల చేయడంతో అప్పుడు మాట్లాడిన బీజేపీ నేతలపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
This post was last modified on May 24, 2023 8:43 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…