ఏపీ అసెంబ్లీ ఎన్నికలు మరో ఏడాది లోపే జరుగుతున్న వేళ బీజేపీ అధిష్టానం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. నలుగురి వల్ల వస్తున్న అనర్థాలను అరికట్టే చర్యలు చేపట్టింది. ఎక్కడా నోరు మెదపవద్దని, పార్టీ లైన్ ను మాత్రమే ప్రచారం చేసేందుకు వారి సేవలను వినియోగించాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. దానితో వాళ్లు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు.
నిజానికి వైసీపీ పాలనా వైఫల్యాల పై గాకుండా టీడీపీ పై విమర్శలు చేయడం రాష్ట్ర బీజేపీలో కొంతమంది నేతలకు అలవాటైంది. పోలవరం నిర్మాణం జరగకపోయినా, అమరావతి ఆగిపోయినా పట్టించుకోని బీజేపీ నేతలకు సాక్షాత్తు హోమ్‌మంత్రి అమిత్ షా తిరుపతిలో తలంటారు. దీంతో అమరావతి రైతుల పాదయాత్రకు హడావుడిగా వెళ్లి మద్దతు పలికారు. అమరావతిలో ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి బయటవారికి పట్టాలు ఇస్తున్నా… బీజేపీ నేతలు నోరు మెదపకపోవడం పై రాజధాని రైతులు ఆగ్రహంగా ఉన్నారు. ఈలోపు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి కేంద్ర బీజేపీ నేతలు, మంత్రి మురళీధరన్ , శివప్రకాష్ జీ , బీజేపీ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్తులో తన పార్టీ వైఖరి , ఎన్నికల సందర్బంగా తాను వ్యవహరించే విధానం పై స్పష్టంగా చెప్పివచ్చారు. పనిలో పనిగా రాష్ట్రంలో బీజేపీ నేతలు వ్యవహారశైలి వాళ్లు ఇస్తున్న స్టేట్‌మెంట్ లను అక్కడ వివరించారు..
పవన్ ఫిర్యాదులపై బీజేపీ అధిష్టానం సీరియస్ గా దృష్టి పెట్టింది. ఓ నలుగురు నేతల ఓవరాక్షన్ తో ఏపీలో పార్టీ పూర్తిగా దెబ్బతింటోందని గుర్తించింది. వారిని ఢిల్లీ పిలిపించి .. పార్టీని ఎందుకు అభాసుపాలు చేస్తున్నారని ప్రశ్నించింది. ఇకపై మౌనంగా ఉండాలని దిశా నిర్దేశం చేసింది. పొత్తుల వ్యవహారం వారి పరిధిలోకి రాదని అందుకే ఆ అంశంపై వారు నోరుమెదపకపోవడమే మంచిదని ఆదేశించంది. ఈ విషయంలో మీడియా ప్రశ్నలకు కూడా స్పందించవద్దని, కనీసం ప్రైవేటుగా ఎవరితోనైనా మాట్లాడినా లీకైపోయే ప్రమాదం ఉందని హెచ్చరించింది. దీనితో బక్కచిక్కిపోయిన ఆ నలుగురు ఇప్పుడు బయట నోరు తెరవడం మానేశారు.
వైసీపీ ప్రభుత్వంపై పోరాటంలో ఆ నేతలు ఇకపై చిత్తశుద్ధిగా పనిచేయాలని కూడా అధిష్టానం సూచించింది. చివరకు ఎమ్మెల్సీల అవినీతిని కూడా ఎండగట్టాలని ఆదేశించింది. దానితో పార్టీ సమావేశాల్లో వారెవ్వరూ పొత్తులపై మాట్లాడకుండా జాగ్రత్త పడ్డారు. నిత్యం టీడీపీని విమర్శించే ఆ నాయకులకు ఇప్పుడు గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్లయ్యింది. పాపం ఆ నలుగురు ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని అనుకుంటున్నాం..
This post was last modified on May 23, 2023 9:50 am
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…